మోతీ బాగ్ భవనం వెనుక 1847 లో మహారాజా నరేంద్ర సింగ్ నిర్మించిన శీష్ మహల్ పాటియాలా మహారాజుల నివాస భవనంగా వుండేది. గాజులు, అద్దాలతో నిర్మించడం వల్ల ఈ భవనాన్ని అద్దాల భవనంగా కూడా పిలిచే వారు. దీని అందాన్ని ఇనుమడింప చేస్తూ దీని ముందే ఒక సరస్సు, దాని మీద లక్ష్మణ్ ఝూలా అని పిలిచే ఒక వంతెన కూడా వున్నాయి. ఈ మహల్ లో వున్న మ్యూజియం లో ప్రపంచం లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పతకాల అతి పెద్ద సేకరణ వుంది. ఇక్కడి గోడలు, పైకప్పుల మీద అందంగా వివరంగా చెక్కిన కళాకృతులు రాజస్థాన్, కాంగ్రా కళాకారుల నైపుణ్యాన్ని, శ్రమను కళ్ళకు కడతాయి. ప్రతి ఏటా ఈ శీష్ మహల్ లో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, వారసత్వ ఉత్సవాలు జరుగుతాయి.



Click it and Unblock the Notifications