త్రిశంకు కొండలు పీర్ మేడ్ కు 4 కి. మీ. ల దూరం లో కలవు.ఈ కొండల నుండి కనపడే దృశ్యాలు పర్యాటకులను అబ్బుర పరుస్తాయి. చల్లని పిల్ల గాలుల మధ్య పర్యాటకులు తమ విశ్రాంతి సెలవులని ఎంతో ఆనందంగా గడపవచ్చు. ప్రత్యేకించి సూర్యాస్తమయం సమయం లో ఈ ప్రదేశం లో ఆకాశం లో కనబడే నారింజ రంగు ఎరుపు, ఆకర్షణీయ నీలం రంగు ఎంతో ముచ్చటగా వుంటాయి.
నిదానమైన ట్రెక్కింగ్ కు చక్కని నడకకు త్రిశంకు కొండలు అనువైనవి. ఫ్యామిలీ టూర్లు, బైకింగ్ ట్రిప్పులు, ట్రెక్కింగ్ ట్రిప్పులు ఒక రోజు ట్రిప్పులు, హనీమూన్ ట్రిప్పులు వేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ ప్రియులు మరింత ఆనందిచవచ్చు.



Click it and Unblock the Notifications