101 ద్వారాల గృహం పోచంపల్లి పట్టణం లోని ఒక ఆసక్తికరమైన పురాతన భవనం. కనీసం 150 సంవత్సరాల వయసు కలదిగా భావించబడుతున్న ఈ భవనాన్ని గ్రామ ఆదాయ ప్రధానాధికారి నిర్మించాడు. మనోహరమైన దృశ్యాలని చూపించే 101 తలుపులు, కిటికీలు ఉండటం వల్ల భవనానికి ఆ పేరు పెట్టారు.
అనేకమైన తలుపులు, కిటికీలు ఉండే ఇంటిని ప్రత్యక్షంగా చూడాలనుకునే యాత్రికులకు ఈ భవనం బాగా నచ్చుతుంది. అయితే భద్రతా కారణాల వల్ల అన్ని తలుపులు, కిటికీలు తెరచి ఉంచబడవు. మీ అదృష్టం బాగుంటే భద్రతా సిబ్బందిని బ్రతిమాలి మరి కొన్ని తలుపులు, కిటికీలు తెరిపించగలరు. ప్రతి ఒక్క తలుపు, ప్రతి ఒక్క కిటికీ మీకు ఒక మనోజ్ఞమైన పరిసర దృశ్యాన్ని చూపిస్తుంది. అదే ఈ భవన విశిష్టత.
ఈ భవనం ఇప్పుడు స్థానిక బాలల కోసం “శాంతినికేతన్” పాఠశాలగా మార్చివేయబడింది. పర్యాటకులని కేవలం వారంలో కొన్ని రోజులు, అదీ నిర్ణీత సమయంలో మాత్రమే భవనంలోకి అనుమతిస్తారు.



Click it and Unblock the Notifications