ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురి అండ్ నేషనల్ పార్క్ సంరక్షిత అన్నామలై కొండల మీద కలదు. 1961 లో అప్పటి ప్రధాన మంత్రి సందర్సన తర్వాత దీని పేరు మార్చారు. ఇది సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తున కలదు. సుమారు 958 చ.కి.మీ.ల విస్తీర్ణం లోకలదు. ఈ పార్క్ లో వివిధ రకాల మొక్కలు, వన్య జీవులు కలవు. చిరుతలు,లేళ్ళు, పులులు,ఏనుగులు వంటివి కలవు. అనేక అరుదైన పక్షులు కూడా కలవు. పార్క్ పరిసరాలలో కల అమరావతి రిజర్వాయర్ లో మొసళ్ళు కలవు. వందలాది పర్యాటకులు సందర్శన కు ఇక్కడకు వస్తారు.



Click it and Unblock the Notifications