అరికమేడు, పాండిచేరి

మోర్టిమర్ వీలర్ 1940 లో ఎంతో విస్తృతంగా పురావస్తు తవ్వకాలు జరిపిన ప్రదేశాలలో అరికమేడు ఒకటి. అరికమేడు చోళులు, రోమనుల మధ్య వాణిజ్యం జరిగిన చోళరాజ్యానికి చెందిన పురాతన వాణిజ్యరేవు అని కనుగొన్నారు. ఇక్కడ రోమనులు నివసించారనడానికి సాక్షాలుగా ఇక్కడి తవ్వకాలలో దొరికిన కుండలను బట్టి తెలుస్తుంది.

అరికమేడులో దొరికిన కుండల మీద రోమన్ సామ్రాజ్య గొప్పతనాన్ని తెలియచేసే గుర్తులు ఉంటాయి. అరికమేడు పూసలను తయారు చేసే ఒక ముఖ్య కేంద్రం.  ప్రజలు 1 వ శతాబ్దంలోనే మొదట నివాసం ఏర్పరుచుకున్నారని విశ్వసించే అరికమేడును పాండిచేరి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒకసారి  చూడవచ్చు.

Please Wait while comments are loading...