అరబిందో ఆశ్రమాన్ని బ్రిటిష్ వారి అణచివేతను తప్పించుకోవడానికి పాండిచేరి వచ్చిన శ్రీ అరబిందో ఘోష్ 1926 లో స్థాపించారు. ఈ ఆశ్రమాన్ని “ ది మదర్” గా పిలిచే మీరా అల్ఫస్సా నవంబర్ 24, 1926 నుండి ఆవిడ మరణం వరకు ముఖ్యులుగా ఉండేవారు. 1950 లో శ్రీ అరొబిందో మరణం తర్వాత ఏర్పాటు చేసిన శ్రీ అరొబిందో ఆశ్రమ ట్రస్ట్ కు కూడా ఆవిడ ముఖ్యురాలుగా ఉన్నారు.
మూడు సంవత్సరాలలోపు పిల్లలను ఆశ్రమం లోనికి అనుమతించక పోవడమే కాక, ఆశ్రమ నిర్వాహకుల నుండి ప్రత్యేక అనుమతి ఉంటేనే ఫోటోలను కూడా తీసుకోవడానికి వీలవుతుంది. ఆశ్రమాన్ని సామాన్య ప్రజల సందర్శనార్ధం ఉదయం 8 గంటల నుండి 12 మధ్యాహ్నం వరకు తిరిగి 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు.



Click it and Unblock the Notifications