ప్రోమనేడ్ బీచ్ గా పేరొందిన పాండిచేరి బీచ్ పాండిచేరి లో ఒకప్పటి ప్రధాన ఆకర్షణ. అరియంకుప్పం వద్ద ఒక కొత్త ఓడరేవు నిర్మాణం వలన సముద్రం కోతకు గురికావడం ఈ అందమైన బీచ్ కు ప్రాణా౦తకంగా పరిణమించింది. ఇప్పుడు ప్రోమనేడ్ లో మిగిలినది అంతా నడకకు లేదా ఈత కోసం పనికి రాకుండా ఉన్న పగిలిన రాళ్ళ గుట్ట, బండరాళ్ల సముద్ర గోడ.
అయినప్పటికీ, సముద్రపు గోడ పై వైపున “లా ఫాక్స్ – ప్లేజ్” అనే ఒక కృత్రిమ బీచ్ ను నిర్మించారు, అంటే సాహిత్యపరంగా నకిలీ బీచ్ అని అర్ధం. సాయంత్రం సమయాల్లో బీచ్ వెంబడి ట్రాఫిక్ ను అనుమంతించక పోవడం వలన సముద్రం ప్రక్కగా నడకకు ఈ ప్రాంతం ఎంతో ఆదర్శంగా ఉంటుంది. 1.5 కిలోమీటర్ల మేరా విస్తరించి ఉన్న ప్రోమనేడ్ బీచ్ పట్టణంలోని అన్ని ప్రధాన ఆకర్షణలతో బాటుగా సమాంతరతను కల్గి ఉంది. ఇది ఇప్పటికి పాండిచేరిలో ఒకసారి తప్పని సరిగా చూడవలసిన ప్రాంతం.



Click it and Unblock the Notifications