పొన్ముడి పర్వత ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక మధురానుభూతిని కలిగించే ప్రకృతి సందర్శనగా భావిస్తారు. వాతావరణం ఆహ్లాదంగా ఉండి సంవత్సరం పొడవునా ట్రెక్కింగ్ కు అనుకూలమే. అయితే, వర్షాకాలం ట్రెక్కింగ్ సూచించదగినది కాదు. కాలినడకన అన్వేషించాలనుకునేవారికి పొన్ముడి వన సంరక్షణా సమితి గైడ్ లను కూడా ఏర్పరుస్తుంది.
అగస్త్య కూడం ప్రదేశాన్ని ట్రెక్కర్లు తప్పక చూడాలి. ఇది పడమటి కనుమలలో అతి పొడవైన శిఖరం. ట్రెక్కింగ్, హైకింగ్ సౌకర్యాలు కలవు. అయితే, ట్రెక్కింగ్ కు అటవీ శాఖ ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుంది.
ఈ ప్రదేశంలో దుకాణాలు ఉండవు కనుక పర్యాటకులు తమతో తగిన ఆహార పదార్ధాలను, నీటిని తీసుకు వెళ్ళడం సూచించదగినది.



Click it and Unblock the Notifications