మాసిలమని నాతార్ కోవిల్ పాండ్య వంశానికి చెందిన మరవర్మ కులసేఖర పాండియన్ రాజు క్రీశ 1305 లో నిర్మించాడు. ఇది ఆ కాలంలోని నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. పూంపుహార్ సందర్శించే ప్రతిఒక్కరు దీనిని తప్పక సందర్సించాలి. ఆనాటి నిర్మాణ సంప్రదాయాలకు యీగుడి నిర్మాణం అడ్డం పడుతుంది. కాలక్రమంలో సముద్రపు కోతవల్ల గుడి ముందుభాగం చాలావరకు దెబ్బతింది. ఇప్పటికీ, ఆ ఆలయం మరమ్మత్తులో ఉండడంవల్ల ధార్మిక కార్యక్రమాలు ఏవీ నిర్వహించడం లేదు. కానీ ఇది ఇప్పటికీ పూంపుహార్ లో అత్యంత ప్రసిద్ధ నిర్మాణం. ఇది పూంపుహార్ వ్యాపార కేంద్రానికి చాలా దగ్గరలో ఉండడం వల్ల ఒకసారి మీరు పూంపుహార్ చేరితే అక్కడికి తేలికగా వెళ్ళవచ్చు.



Click it and Unblock the Notifications