పునలూర్ వేలాడే వంతెనను 1877 సంవత్సరంలో కల్లాడ నదిపై బ్రిటీషర్ అయిన ఆల్బర్ట్ హెన్రీ నిర్మించాడు. వాహన రవాణా కొరకు దీనిని నిర్మించారు. దీని నిర్మాణానికి ఆ కాలంలో ఆరు సంవత్సరాలు పట్టిందని చెపుతారు. ఈ వేలాడే బ్రిడ్జి పై నడవాలంటే ప్రజలు సందేహ పడేవారు. వారి సందేహాన్ని పోగొట్టేందుకు ఇంజనీరు అరడజను ఏనుగులు బ్రిడ్జిపై నడుస్తూంటే, తాను తన కుటుంబ సభ్యులతో వంతెన కింద గల నీటిలో బోటుపై ప్రయాణం చేసి వారికి నమ్మకం కలిగించాడు.
వన్య జంతువులు పట్టణంలోకి రాకుండా కూడా ఈ వంతెన నిర్మించబడింది. కాంక్రీటు బ్రిడ్జి అయితే జంతువులు వస్తాయని, వేలాడే వంతెన అయితే, వేలాడులో కదిలి అవి భయపడి రావని భావించి దీనిని ఏర్పాటు చేశారు. ఈ వంతెన 100 అడుగుల లోతు కల నాలుగు బావుల ఆధారంగా నిలబడింది.



Click it and Unblock the Notifications