సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియంను సర్ ఆర్థర్ కాటన్ జ్ఞాపకార్ధం నిర్మించారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నది అంతటా నీటిని సేకరించి శుభ్రంచేసి పట్టణాలకు సరఫరా చేసే ఏర్పాటు మొట్టమొదటి సారిగా చేసారు. ఈయన ఒక బ్రిటీష్ ఇంజినీర్. ధవలెస్వరం వద్ద గోదావరి నది పై ఆనకట్ట నిర్మింఛి ఈ ప్రాంతాన్ని సస్యస్యామలం చేసారు. ముఖ్యంగా, భారతదేశం లో నీటిపారుదల ఇంజనీరింగ్ ఆనకట్ట విధానం ,నిర్మాణ పద్ధతులు సర్ ఆర్థర్ కాటన్ ఆవిష్కరించారు. సర్ ఆర్థర్ కాటన్ ను "డెల్టా ఆర్కిటెక్ట్"అని అంటారు. ఈయన కట్టిన అనకట్టల వల్ల చాలా ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం రాష్ట్రంలో సివిల్ ఇంజనీరింగ్ , సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట నిర్మాణం మరియు అనేక అరుదైన ఛాయాచిత్రాలు ఉన్నాయి. ఆనకట్ట నిర్మించేందుకు ఉపయోగించే పనిముట్లు కూడా ఇంకా ఇక్కడ చూడవచ్చు.



Click it and Unblock the Notifications