ఎన్నో ఏళ్ళ నుంచి జైన మతావలంబులకు కూడా రాజగిర్ ప్రధాన క్షేత్రం. దీన్నే పంచ పహాడీ అని కూడా అంటారు. ఈ దేవాలయాల నుంచే ఎంతో మంది సాధువులు తపస్సు, ధ్యానం చేసి మోక్షం పొందారు. జైన మత స్థాపకుడు మహావీరుడు కూడా ఇక్కడికి చాలాసార్లు వచ్చాడు. రాజగిర్ కొండ చుట్టు పక్కల వున్న మొత్తం 26 దేవాలయాలను పర్వతారోహణ ద్వారా చేరుకోవచ్చు. ధార్మికత తో పాటు సాహసికులకు కూడా ఈ ప్రదేశం ఆసక్తి కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications