ఉత్తిరకోసమంగాయి దేవాలయం లో శివుడు పూజలు అందుకుంటాడు. ఇది తమిళ్ నాడు లోని రామనాథపురం జిల్లా లో కలదు. చాలామంది శైవులు ప్రతి సంవత్సరం ఇక్కడకు వస్తారు. ఈ టెంపుల్ గురించి కొన్ని గ్రంధాలలో కూడా కలదు. ఈ టెంపుల్ కు రామనాథపురం లేదా పరమక్కుడిల నుండి చేరవచ్చు. ఈ ప్రదేశం సేతుమాధవ తీర్థం, లక్ష్మణ తీర్థం మరియు రామనాథ పురంలతో సమాన ప్రాముఖ్యత కలిగి వుంది. ఈ టెంపుల్ ను దేశవ్యాప్తంగా ప్రజలు అర్చిస్తారు.టెంపుల్ లో ఒక పురాతన నటరాజ విగ్రహం కలదు. దీనిని పచ్చలతో చెక్కారు. ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు ఇక్కడ డిసెంబర్ లో జరిగే ఆరుద్ర పండుగ వేడుకలకు తరలి వస్తారు.



Click it and Unblock the Notifications