జూలా దేవి ఆలయం అని కూడా పిలువబడే జులా దేవి ఆలయం, రాణిఖేత్ పట్టణం నుండి 7 కి.మీ.ల దూరంలో నెలకొని ఉన్న ప్రసిద్ధ ధార్మిక ప్రదేశం. హిందూ మత దైవం దుర్గాదేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం 8 వ శతాబ్దంలో నిర్మించారు. హిందూ మత పురాణాల ప్రకారం, ఈ ఆలయాన్ని ఈ ప్రాంతపు అటవీ జంతువుల నుంచి రక్షణను అభ్యర్థిస్తూ దుర్గాదేవి కోసం నిర్మించారు. ఒక గొర్రెల కాపరికి దుర్గాదేవి కలలో కనిపించి విగ్రహాన్ని త్రవ్వి తియ్యమని చెప్పింది. విగ్రహం కనుగొనబడిన ప్రదేశంలోనే ఆలయం నిర్మించారు.
ఆలయం అందంగా చెక్కిన పవిత్ర గంటలు కలిగి ఉంది. ఈ గంటల ధ్వని దూరం నుండి కూడా స్పష్టంగా వినిపిస్తుంది. యాత్రికులు ఈ ఆలయంలో జులాదేవిని ప్రార్థిస్తే వారి కోరికలు తప్పక తీరుస్తుందని భావిస్తారు. ఈ ప్రదేశం సమీపంలో ఉన్న రామాలయం కూడా సందర్శించవచ్చు.



Click it and Unblock the Notifications