Search
  • Follow NativePlanet
Share

రేవా  - సహజమైన మరియు మానవ నిర్మిత అందాల కలయిక !

14

రేవా పట్టణము మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో ఉంది. ఈ పట్టణము జిల్లాకు కేంద్రంగా ఉన్నది. రేవా పర్యాటకం ప్రసిద్ధ మ్యూజియాలు, కోటలు, జలపాతాలు మరియు చారిత్రక గ్రామాలకు ప్రసిద్ధిచెందింది. అంతే కాకుండా రేవాలో సహజ మరియు మానవ నిర్మిత అందాలు ఉన్నాయి. ఇది తెల్ల పులులకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశము బింఝ్ పహార్, దిగువ నార్తరన్ సాదా, క్య్మోరే పహార్ మరియు రేవా పీఠభూమి అనే నాలుగు భాగాలుగా విభజించబడింది.

రేవా మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

రేవా పర్యాటకంలో టైగర్ రిజర్వు, బఘెల్ మ్యూజియం, రేవా ఫోర్ట్, పిలి కోఠి, గోవింద్గర్ ఫోర్ట్, గోవింద్గర్ ప్యాలెస్, వెంకట్ భవన్, రాణి తలాబ్, APS విశ్వవిద్యాలయం స్టేడియం, భైరోం బాబా విగ్రహం, రాణిపూర్ కర్చులిఅన్ , కేంటి జలపాతాలు, పూర్వ జలపాతాలు మరియు చచై జలపాతాలు వంటి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.

రేవా చరిత్ర

ఈ పట్టణమునకు ఆ పేరు జిల్లా పేరు నుండి వచ్చింది. అంతేకాక రేవా యొక్క రెండవ పేరు నర్మదా నది. పురాణములు ప్రకారం మూడవ శతాబ్దం BC సమయంలో జిల్లాలో ఉన్న ఈ భూభాగాలను మౌర్య చక్రవర్తులు పాలించేవారని నమ్ముతారు. ఇక్కడె మొట్టమొదటి తెల్ల పులిని కనుకోన్నారని చెప్పుతారు.

రేవా చేరుకోవడం ఎలా

ప్రయాణికులు విమాన,రైలు,రోడ్డు మార్గాల ద్వారా రేవాను చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం ఖజురహో లో ఉంది. ఇది భారతదేశం యొక్క ముఖ్యమైన నగరాలకు అనుసంధానము కలిగి ఉంది. రేవా పట్టణానికి సమీపంలోనే రేవా రైల్వే స్టేషన్ ఉంది. ఖజురహో నుండి రేవా కు బస్సులు కూడా ఉంటాయి.

రేవా సందర్శించడానికి ఉత్తమ సమయం

ఈ పట్టణంను సందర్శించటానికి వర్షాకాలం అనువైన సమయం. వర్షాకాలం జూలైలో మొదలై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో పట్టణం అందమైన ప్రకృతితో చూడముచ్చటగా ఉంటుంది.

రేవా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రేవా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రేవా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రేవా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ప్రయాణికులకు రేవా నుండి అన్ని ఇతర ప్రధాన పట్టణాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. రేవా నుండి ఖజురహో కు బస్సు టిక్కెట్లు ఖర్చు 120 రూ.నుండి 130.రూ మధ్య ఉంటుంది. ప్రయాణికులకు ఖజురహో నుండి 169 km దూరంలో ఉన్న రేవా ను కారు ద్వారా చేరుకోవటానికి రెండు గంటల పది నిమిషాల సమయం పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం రేవా రైల్వే స్టేషన్ రేవా పట్టణం నుండి కేవలం 5.8 km వద్ద ఉంది. మధ్యప్రదేశ్ మరియు భారతదేశం యొక్క ఇతర ప్రాంతాల్లో వివిధ ప్రదేశాల నుండి రైళ్లు క్రమ విరామాలతో ఈ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణిస్తున్నాయి. ప్రయాణికులు రేవా చేరుకోవడానికి భూపాల్, న్యూ ఢిల్లీ మరియు జబల్పూర్ నుండి రైళ్లు అందుభాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం పర్యాటకులకు రేవా సమీపంలోని విమానాశ్రయం ఖజురహో విమానాశ్రయం. ఈ ఖజురహో విమానాశ్రయం నుండి రేవా చేరుకోవటానికి సాధారణ బస్ మరియు టాక్సీ లు అందుభాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Sat
Check Out
26 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun

Near by City