కోహోజ్ పర్వత కోట సజన్ గ్రామంలో సుప్రసిద్ధ చారిత్రిక ప్రదేశం. ఈ ఆకర్షణ చాల అద్భుత దృశ్యాలను చూపిస్తుంది. జలాశయం మీద వున్న ఈ కోట భోజ కాలం నాడు నిర్మించారు.ఈ కోట వున్న ప్రాకృతిక అందాలతో పాటు దీని వైభవం గత వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. 16వ శతాబ్దంలో గుజరాత్ రాజు నుంచి ఈ కోట ను పోర్చుగీస్ వారు చేజిక్కించుకుని దీన్ని మరింత ధృడంగా తీర్చిదిద్దారు. చివరిగా బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళే ముందు, 18వ శతాబ్దంలో పీష్వాలు దీన్ని చేజిక్కించుకున్నారు.ఈ కోట ఎత్తు సాహసికులకు పర్వతారోహణకు చాలా అవకాశాలు ఇస్తుంది. ఇది విహార కేంద్రంగా కూడా పని చేస్తోంది.



Click it and Unblock the Notifications