దర్లా ఘాట్ సిమ్లా నుండి 35 కి. మీ. ల దూరం లో సిమ్లా బిలాసౌర్ రోడ్ పై కలదు. ఇక్కడ ఒక వైల్డ్ లైఫ్ సంక్చురి కలదు. దీనిలో పర్యాటకులు అనేక జంతువులను, అనేక వలస పక్షులను చూడవచ్చు. హిమాచల్ ప్రదేశ్ టూరిజం శాఖ ఈ ప్రదేశంలో టూర్లు , ట్రెక్కింగ్ లు నిర్వహిస్తుంది. ఈ ప్రదేశ సందర్శనకు అక్టోబర్ , ఏప్రిల్ నెలలు అనుకూలం.