సిమ్లా లో సమ్మర్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం మే , జూన్ నెలలలో జరుగుతుంది. రంగు రంగుల ఈ ఫెస్టివల్ రిజ్ లో నిర్వహిస్తారు. ఎంతో అట్టహాసంగా జరిగే ఈ పండుగలో సిమ్లాలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు తరలి వస్తారు. ఇటీవల ఈ ఫెస్టివల్ ఇతర ప్రదేశాలైన కుఫ్రి మరియు నల్దేరా లలో కూడా చేస్తున్నారు. ఈ ఫెస్టివల్ లో స్థానిక జానపద నృత్యాలు , ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. పండుగ సందర్భంగా అనేక స్టాల్ లు పెట్టి హిమాచల్ ప్రదేశ్ హస్త కళల వస్తువులను విక్రయిస్తారు. ఈ సమయం లో వాతావరణం చల్లగా వుంటుంది కనుక ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి ఆనందిస్తారు.



Click it and Unblock the Notifications