దీక్షిత్ వాడా మ్యూజియం షిర్డీ లో వున్న చిన్న, ఆసక్తికరమైన ప్రదర్శనశాల. సంస్థాన్ సముదాయం మధ్యలో వుండే ఈ మ్యూజియం లో కొన్ని అరుదైన బ్లాక్ అండ్ వైట్ బాబా ఫోటోలు వున్నాయి. ఆయన వాడిన బట్టలు, కఫనీ (పొడవాటి చొక్కా) చర్మ పాదుకలు (చెప్పులు) చిలుం పీల్చిన గొట్టం లాంటి ఇతర వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శించ బడతాయి.బాబా వాడిన గ్రామఫోన్ రికార్డులు, నీళ్ళ గ్లాసులు, వంట పాత్రలు, స్నానం చేసిన రాయి లాంటి వన్నీ మ్యూజియం లో చూడవచ్చు. ఇది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి వుంటుంది.



Click it and Unblock the Notifications