శిర్దిలోని సమాధి మందిరం ప్రవేశం దగ్గర వుండే మసీదే ద్వారకామాయి. సాయి బాబా చివరి వరకూ ఇందులోనే వుండే వారు.ద్వారకామాయి రెండు అంచెలుగా వుంటుంది. మొదటి దాంట్లో బాబాది పెద్ద చిత్రపటం, ఆయన కూర్చోడానికి వాడిన పెద్ద బండ రాయి వుంటాయి. ఇది మళ్ళీ రెండు గదులుగా విభజించారు, ఒక దాంట్లో ఆయన రథం వుండగా, మరో దాంట్లో ఆయన పల్లకీ వుంటుంది. రెండో గదిలో బాబా స్నానం చేయడానికి వాడిన ఒక చతురస్రాకారపు రాతి బల్ల వుంది.ఇందులో వుండే తైలవర్ణ చిత్రపటాలు భక్తులకు, యాత్రికులకు పెద్ద ఆకర్షణగా వుంటాయి.



Click it and Unblock the Notifications