షిర్డీ నుంచి 73 కిలోమీటర్ల దూరంలో శని షింగనాపూర్ లో శని దేవుని దేవాలయం వుంది. ఈ దేవాలయం వున్నా వూళ్ళో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇక్కడి ఇళ్ళకి తలుపులు వుండవు. దొంగతనాలు, దోపిడీలతో సహా అన్ని రకాల ప్రమాదాల నుంచి శని భగవానుడే తమను రక్షిస్తాడని ఇక్కడి వాళ్ళ ప్రగాఢ విశ్వాసం వల్ల తలుపులు పెట్టరు. ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళు అందుకు శిక్షగా అదే రోజు గుడ్డి వారైపోతారని చెప్తారు.శని భగవానుడి విగ్రహం పెద్ద నల్ల రాతితో వుంటుంది. మగ వారు మాత్రమె దీనికి పూజ చేయాలి. ముందుగా భక్తులు స్నానశాలలలో స్నానం చేసి పై వస్త్రం లేకుండా తడి గుడ్డలతో పూజ చేయాలి.షిర్డీ దర్శించే భక్తులలో చాలా మంది శని భగవానుని కూడా దర్శిస్తారు. దేవాలయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరచి టుంది.



Click it and Unblock the Notifications