తీర్థాన్ లోయ లో వున్న గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ వల్ల ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. షోజా కు దగ్గరలో వున్న ఈ లోయ పర్యావరణ పరిరక్షణ మండలం లోకి వస్తుంది – ఇక్కడ పర్యావరణం మీద కాలుష్యం దుష్ప్రభావాలు పడకుండా చాలా చర్యలు తీసుకున్నారు. ఈ లోయలోని నదులలో యాంగ్లింగ్ చేయడాన్ని కూడా పర్యాటకులు ఆస్వాదించవచ్చు.