ఘోరమంగార్ లేదా ఖొదవ పహార్ రోబెర్ట్స్ గంజ్ నుండి 38 కి.మీ.ల దూరం లోను, మావు కలాన్ విలేజ్ కు 13 కి.మీ.ల దూరంలోను కలదు. ఈకొండ కౌవాఖో రాక్ షెల్టర్ కలిగి వుంటుంది. ఏటవాలు కొండపై కల ఈ రాక్ షెల్టర్ చేరటం కష్టం. కాని ఒకసారి చేరితే చాలు ఎంతో ఆనంద పడతారు.
ఇక్కడ అనేక పరసర ప్రకృతి దృశ్యాలు మిమ్ములను ఆనంద పరుస్తాయి. ఈ కేవ్ షెల్టర్ లో ఆనాటి ప్రజల జీవనాన్ని ప్రతిబింబించే అనేక పెయింటింగ్ లు కలవు. వేట, నృత్యాలు, యుద్ధ సన్నివేశాలు మొదలైన దృశ్యాలను చిత్రీకరించారు. ఘోర మంగర్ రాక్ షెల్తెర్లో ఫ్రాగ్ డాన్స్ ఒక ప్రత్యేకత. ఈఫ్రాగ్ డాన్స్ ను వర్షాలు పడే టందుకు , ప్రత్యేకించి కరువు సమయంలో ప్రదర్శిస్తారు. ఈ డాన్స్ లో వారు బల్లెములు వంటివి పట్టుకొని ఆకర్షణీయంగా వుంటారు.



Click it and Unblock the Notifications