Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సుర్ గూజా

సుర్ గూజా - పురాతన ప్రదేశాల అన్వేషణ, తీర్థ యాత్ర !

26

సుర్ గూజా ఛత్తీస్ ఘర్ కు ఉత్తర భాగంలో ఉత్తర ప్రదేశ్ మరియు జార్ఖండ్ లు సరిహద్దులు గా వుంటుంది. ఈ ప్రదేశంలో 50 శాతం అటవీ భాగం కాగా ఇక్కడ అంతా అటవీ తెగలు నివసిస్తారు. ఇండియా లో చత్తీస్ ఘర్ 17 వ తేయాకు ఉత్పత్తి రాష్ట్రం. సుర్ గూజా మరియు జష్పూర్ లలో తేయాకు ఉత్పత్తి కి అనువైన పరిస్థితులు కలవు.

ఈ ప్రదేశం గురించి అనేక పురాణగాధలు కలవు. శ్రీరాముడు తన వనవాస సమయం లో ఈ ప్రాంతంలో కొంత కాలం నివసించాడని చెపుతారు. కొన్ని ప్రదేశాలకు శ్రీరామా, లక్ష్మణ, సీత ల పేర్లు కలవు. రాం ఘర్, సీతా భేన్గ్రా, లక్ష్మణ్ ఘర్ వంటివి వాటిలో కొన్ని.

సుర్ గూజా కూడా ఇతర ప్రదేశాల వలెనె, అనేకమంది రాజుల వంశ పాలనలను చూసింది. నందులు, మౌర్యులు తర్వాత ఇది రక్షాల్ తెగ పాలనకు వచ్చింది. ఇది ఒక రాజ్యంగా బ్రిటిష్ పాలనలో వుండేది. సుర్ గూజా లో హస దేవ్ , రిహంద్, కన్హార్ నదులు కలవు. సుర్ గూజా ప్రకృతి అందాలకు ముగ్ధులై ఇక్కడ సినిమాలను తీసిన వాటిలో 'ది లాస్ట్ మైగ్రేషన్' అనే సినిమాకు గ్రీన్ ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది.

సుర్ గూజా లోను, చుట్టుపట్ల కల పర్యాటక ప్రదేశాలు

చరిత్ర, అటవీ తెగల ప్రభావం కల సుర్ గూజ పర్యాటకులు తప్పక చూడ దగినది. పూర్వకాలం నాటి అనేక టెంపుల్ శిధిలాలను , చేక్కదాలను నేటికీ చూడవచ్చు. చత్తీస్ ఘర్ లో కల అనేక వాటర్ ఫాల్ ల లో ఒకట సుర్ గూజ లో కలదు. టైగర్ పాయింట్ వాటర్ ఫాల్ మని పాత లో కలదు. చరిత్ర పూర్వపు పెయింటింగ్ లు కల రాం ఘర్, సీతా బెంగ్రా గుహలు ప్రసిద్ధి. శ్రీరాముడు తన 14 ఏళ్ల వనవాసంలో ఇక్కడ కొంత కాలం గడిపాడని చెపుతారు. ఇక్కడ కల అంబికాపూర్ టెంపుల్ మరొక ఆకర్షణ. తాత పాణి లో ఔషధ గుణాలు కలిగి నిరంతరం ప్రవహించే ఒక వేడి నీటి బుగ్గ కలదు. దీపాది లో శిధిల టెంపుల్స్ మరియు చెరువులు వుండగా, దేవ్ ఘర్ లో పురాతన ప్రదేశాలు వుంటాయి. కుదర్ ఘర్ ఒక యాత్రా స్థలం.

ప్రజలు, సంస్కృతి

సుర్ గూజ లో అటవీ తెగల జనాభా అధికం. పండో మరియు కోర్వా అనే తెగలు నేటికి అడవుల్లోనే కలవు. పండో తెగ పాండవులకు, కోర్వా తెగ కౌరవులకు సంబంధించినవని చెపుతారు. సుర్ గూజ రైతులు సేరి కల్చర్ లో ప్రవీణులు. భారియా తెగలు, భారియ భాష మాట్లాడతారు. ఏ వేడుక జరిగినా వీరు జానపద నాట్యాలు చేస్తారు.

శిలా డాన్స్ లో పురుషులు మాత్రమే పాల్గొంటారు. ఈ డాన్సు పంటల కోతల సమయం అయిన జనవరి లో వుంటుంది. రాజకీయ ఊరేగుమ్పులు, పబ్లిక్ లేదా నేషనల్ పండుగలలో కూడా పురుషులు మాత్రమే డాన్స్ చేస్తారు. ఈ డాన్స్ లో వెదురు కర్రలు ఉపయోగిస్తారు. యువతులు సువా డాన్స్ ను వయసు వచ్చిన యువకుల కొరకు చేసి వారిని ఆకర్షిస్తారు. మహిళలు, పురుషులు వివిధ సాంప్రదాయాలకు వివిధ రకాల డాన్స్ లు చేస్తారు.

సుర్ గూజా వాతావరణం

వేసవులు, శీతాకాలాలు, అత్యధిక వేడి, చలి కలిగి వుంటాయి.

ఎలా చేరాలి ?

సుర్ గూజా చేరేందుకు రైలు, రోడ్డు మార్గాలు అనుకూలం.

సుర్ గూజా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సుర్ గూజా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సుర్ గూజా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సుర్ గూజా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం దుర్గ, బిలాస్ పూర్ మరియు రేయ్ పూర్ ల నుండి బస్సు లు కలవు, ప్రైవేటు టాక్సీ లు కూడా దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం బిలాస్ పూర్ కు 230 కి. మీ. లు, రాయ్ పూర్ కు 336 కి. మీ. ల దూరంలో వుంటుంది. రాత్రి వేల ట్రైన్ లు దుర్గ మరియు అంబికాపూర్ ల మధ్య నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం సుర్ గూజా కు 375 కి. మీ. ల దూరం లో కల రాయ్ పూర్ విమానాశ్రయం సమీపం. ఇక్కడ నుండి దేశంలోని ప్రధాన నగరాలకు సేవలు కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue