Search
  • Follow NativePlanet
Share

తెహ్రి - హిమాలయాలలో ఒక పర్యటన అనుభవం !

16

తెహ్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గర్హ్వాల్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దీనిని 'న్యూ తెహ్రి' అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం జిల్లా ప్రధాన కార్యాలయంగా పని చేస్తుంది. తెహ్రికి ఆ పేరు 'త్రిహన్'అనే పదం నుండి వచ్చింది. త్రిహన్ అంటే ఆ ప్రదేశం మూడు పాపాలను కడుగుతుందని అర్ధం. ఆ మూడింటిని ఆలోచన యొక్క పాపం,పదం యొక్క పాపం మరియు కార్యం యొక్క పాపం అని చెప్పవచ్చు.

భాగీరథి నదిపై తెహ్రి జలాశయ నిర్మాణం కారణంగా పాత తెహ్రి రూపాంతరం చెంది తర్వాత కొత్త తెహ్రి ఉనికిలోకి వచ్చింది. పాత తెహ్రి ప్రజలు ఆనకట్ట నిర్మాణం కోసం మరింత స్థలం అందించేందుకు న్యూ తెహ్రి గా మార్చబడింది. ఆనకట్ట నిర్మాణంనకు వ్యతిరేకంగా ప్రముఖ పర్యావరణవేత్త సుందర్లాల్ బహుగన మరియు అతని అనుచరులు ద్వారా నిరసనలు చేయుట వల్ల ప్రధానంగా తెహ్రి పట్టణం వార్తలలోకి వచ్చింది.

నివేదికల ప్రకారం బ్రిటిష్ పాలనలో తెహ్రి గర్హ్వాల్ యొక్క రాజ వంశీయ రాష్ట్రానికి రాజధానిగా ఉన్నది. 18 వ శతాబ్దంలో తెహ్రి ఈస్ట్ ఇండియా కంపెనీ తన నౌకలను నిలపటానికి ఒక ముఖ్యమైన నౌకాశ్రయంగా సేవలందించింది.

తెహ్రి మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

తెహ్రి ఆనకట్టను చూడటానికి సంవత్సరం మొత్తం పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. తెహ్రిలో ఈ ప్రదేశం చాలా పేరు పొందిన పర్యాటక ఆకర్షణగా ఉన్నది. తెహ్రి ఆనకట్ట ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్టల్లో ఒకటి. భాగీరథి మరియు భిలన్గంగా అనే రెండు నదుల నీటి ద్వారా జలవిద్యుత్తును అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది.

పర్యాటకులు తెహ్రి పర్యటనలో బుద కేదర్ ను కూడా సందర్శించవచ్చు. బుద కేదర్ వద్ద ఉన్న శివాలయంలో శివలింగం ఉత్తర భారతదేశంలో అతిపెద్ద శివలింగంగా ప్రసిద్ధి చెందింది.

తెహ్రిలో సేమ్ ముఖెం ఆలయంను తప్పక సందర్సించాలి. ఆ ప్రాంతంలో ఎక్కువగా పూజింపబడుతున్న సర్ప దేవుడు అయిన నాగరాజుకు అంకితం చేయబడింది. పర్యాటకులు కుంజపురి శిఖరంపై ఉన్న కుంజపురి దేవి ఆలయంను కూడా సందర్శించండి. శక్తివంతమైన హిమాలయాలు మరియు భాగీరథి లోయ యొక్క విస్తృత దృశ్యాలను ఆలయ సముదాయం నుండి ఆస్వాదించవచ్చు. తెహ్రి లో ఇతర ముఖ్యమైన పర్యాటక ఆకర్షణలుగా ఖట్లింగ్ హిమనీనదం,నరేంద్ర నగర్,చంద్రబాద్ని ఆలయం,ఘుట్టు మరియు నాగ్ తిబ్బ ఉన్నాయి.

తెహ్రి చేరుకోవడం ఎలా

పర్యాటకులు విమాన,రైలు,రోడ్డు మార్గాల ద్వారా తెహ్రి ని చేరుకోవచ్చు. డెహ్రాడూన్ లో జాలీ గ్రాంట్ విమానాశ్రయం,న్యూ ఢిల్లీ లో ఇందిరా మహాత్మా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానాలు అందుబాటులో ఉన్నాయి. విమానాశ్రయం నుండి తెహ్రి చేరుకోవటానికి టాక్సీలు అందుబాటులో ఉంటాయి. తెహ్రికి అతి దగ్గర రైల్వే స్టేషన్ రిషికేశ్ లో ఉన్నది.

మసూరీ,రిషికేశ్,హరిద్వార్,దేవప్రయగ్,శ్రీనగర్ మరియు ఉత్తరాఖండ్ సమీపంలోని ప్రదేశాల నుండి తెహ్రికి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ కాశ్మీరీ గేట్ వద్ద ISBT చెందిన అంతర్ రాష్ట్ర బస్సులు ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి.

తెహ్రి సందర్శించడానికి ఉత్తమ సమయం

తెహ్రిలో సంవత్సరం అంతా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉన్నప్పటికీ సందర్శించటానికి ఉత్తమ సమయం ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య ఉంటుంది.

తెహ్రి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తెహ్రి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తెహ్రి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తెహ్రి

  • రోడ్డు ప్రయాణం
    తెహ్రి ని పర్యాటకులు బస్సుల ద్వారా చేరవచ్చు. లగ్జరీ మరియు నాన్ లగ్జరీ బస్సులు న్యూఢిల్లీ కాశ్మీరీ గేట్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ (ISBT)నుండి తెహ్రి కి అందుబాటులో ఉంటాయి. మసూరీ,రిషికేశ్, హరిద్వార్,దేవ ప్రయాగ్,శ్రీనగర్ మరియు ఉత్తరకాశి వంటి సమీపంలోని స్థలాల నుండి రెగ్యులర్ బస్సులు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    తెహ్రి అతి దగ్గరలో రైల్వే స్టేషన్ 70 కిలోమీటర్ల దూరంలో రిషికేశ్ లో ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ నుండి తరచుగా రైళ్లు భారతీయ పట్టణాలకు అనుసంధానం చేయబడి ఉంటాయి. ప్రయాణికులు తెహ్రి చేరుకోవడానికి స్టేషన్ నుండి టాక్సీలు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    తెహ్రి సమీప విమానాశ్రయం 85 కిమీ దూరంలో డెహ్రాడూన్ లో జాలీ గ్రాంట్ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం భారతదేశంలోని అన్ని ప్రముఖ నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. ఈ విమానాశ్రయం న్యూ ఢిల్లీలో ఇందిరా మహాత్మా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో తరచుగా విమానాల ద్వారా అనుసంధానించబడినది. ఇది అన్ని ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానించబడింది ఉంది. పర్యాటకులు తెహ్రి చేరుకోవడానికి జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed