జంబు లింగేశ్వర మరియు అఖిలాండేశ్వరి టెంపుల్ ను చోళ రాజులలో మొదటి వాడిన కోచెంగా చోళ నిర్మించారు. టెంపుల్ గోడలపై లిఖిత శాసనాలు కలవు. ఈ టెంపుల్ కనీసం 1,800 ఏళ్ల నాటిది గా చెపుతారు. అయినపటికి ఇది మంచి స్థితి లో కలదు. ఎప్పటికపుడు మరమ్మతులు చేయిస్తుంటారు. జంబు కేశ్వర లింగం కింద నీరు వుండటం గమనిస్తారు. ఈ నీటిని ఎపుడు ఖాళీ చేసినా సరే, మరల ఆ స్థలం నీటి తో నిండి పోతుంది. ఒక కదా మేరకు పార్వతి శివుడి తపస్సు ను భంగ పరచిందని అపుడు శివుడు కోపించి ఆమెను భూమిపై తపము చేయవలిసిందిగా ఆదేసాన్చినాదని అపుడు ఆమె భూమిపై ఇక్కడ అఖిలాండేశ్వరి గా అవతరించి జంబు అడవి లో తపస్సు మొదలు పెట్టిందని అక్కడి కావేరి నది నీటి తో శివ లింగం తయారు చేసిందని చెపుతారు. పార్వతి తపస్సు చేసిన స్థలం లోనే టెంపుల్ నిర్మించారు.



Click it and Unblock the Notifications