ఈ నెయ్యర్ డ్యాం ను 1958 సంవత్సరం లో నిర్మించారు. ఇది నెయ్యర్ నది,కల్లార్ నది మరియు ముల్లయ్యార్ నది యొక్క సంగమంలో నిర్మించారు.నాయర్ డ్యాం ఒక మంచి పిక్నిక్ స్పాట్. ఇక్కడ ఉన్న పార్క్ లో మొసళ్ళ ఫార్మ్,పులులు ,జింకలు కనిపిస్తాయి.కనీసపు ప్రవేశ రుసుము చెల్లించి ఆనందముగా అందమైన వాతావరణంలో దగ్గరలో ఉన్న వాచ్ టవర్ సందర్శించండి. 7 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఏనుగు పునరావాస కేంద్రంలో ఏనుగు మీద ప్రయాణం చేయవచ్చు.మీరు నెయ్యర్ డ్యాం చేరుకోవడానికి బస్సు లేదా కారులో త్రివేండ్రం నుండి 32 కి.మీ. ప్రయాణం ఉంటుంది.మీరు తొందరగా ఇక్కడకు వచ్చి ఎంజాయ్ చేయండి .



Click it and Unblock the Notifications