శ్రీ పద్మనాభ స్వామి ఆలయం త్రివేండ్రం నగరం నడిబొడ్డున ఉంది. ఈ ఆలయం లో కొలువైన దేవుడు విష్ణువు. ఆలయం ట్రావన్కోర్ మాజీ రాజ కుటుంబం అద్వర్యం లో నిర్వహించబడుతుంది. ఆలయం ద్రావిడ శైలిలో అందంగా రూపొందించబడింది.ఈ ఆలయంలో పద్మనాభ స్వామి విగ్రహం ప్రధాన ఆకర్షణ గా ఉంటుంది.ఈ దేవాలయం పేరుమీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. ‘తిరు’ ‘అనంత’ ‘పురం’ అంటే ‘అనంతపద్మనాభునికి నెలవైన ప్రదేశం’ అని అర్థం. అనంత పద్మనాభుడు అనంతశయన ముద్రలో (యోగనిద్ర ఆకృతిలో అనంతుడనే సర్పం మీద శయనించి) దర్శనమిస్తాడు. మందిరం లో విష్ణువు కు ఒక పక్క శ్రీదేవి మరియొక పక్క భూదేవి ఉంటారు.ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారుచేశారు.నేపాల్‌లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది.ఆలయం లో బంగారు విగ్రహాలు, బంగారు, వెండి పురావస్తు, వజ్రాలు, పచ్చలు మరియు ఇత్తడి తో కలిపి 90,000 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉంది. ప్రతి సంవత్సరం ఆరు మాసాలకు ఒకసారి తులా మాసం (సెప్టెంబరు / అక్టోబరు)లో, ఫాల్గుణ మాసం (మార్చి / ఏప్రిల్) లో 'అల్పిసి ఉత్సవాలు' జరుగుతాయి.తిరువనంతపురం వెళ్ళినప్పుడు ఈ ఆలయం సదర్సించటం తప్పనిసరి.



Click it and Unblock the Notifications