Search
  • Follow NativePlanet
Share
» »చిటపట జల్లుల్లో తడుస్తూ బెంగళూరుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతాలను చూశారా?

చిటపట జల్లుల్లో తడుస్తూ బెంగళూరుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతాలను చూశారా?

వర్షాకాలంలో బెంగళూరుకు దగ్గరగా ఉన్న అత్యంత అందమైన పర్యాటక కేంద్రాలకు సంబంధించిన కథనం.

ఈ ఏడాది ఎండలు ఉద్యానగరిగా పేరుగాంచిన బెంగళూరు వాసులను కూడా భయపెట్టాయి. ఈ ఉక్కపోతల నుంచి ఉపశమనం కలిగించడానికి అన్నట్లు ఈ సారి బెంగళూరుతో పాటు చుట్టు పక్కల ఉన్న అనేక పర్యాటక ప్రాంతాల్లో వర్షాలు బాగా పడ్డాయి.

దీంతో జలాశయాలు నిండు కుండలాగా కనిపిస్తుండగా జలపాతాలు హోయలు పోతూ కనిపిస్తున్నాయి. దీంతో ఇంకా ఆగస్టు కూడా రాకుండానే అనేక హిల్ స్టేషన్లు పచ్చని చీర కట్టినట్లు కనుచూపు మేర పచ్చదనంతో నిండిపోయాయి.

ఈ నేపథ్యంలో వీకెండ్ లోప్రకృతితో మమేకం కావడానికి చాలా మంది ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నారు. వారి కోసమే ఈ కథనం. ఇందులో బెంగళూరు నుంచి వీకెండ్ లో వెళ్లి ప్రకృతిలో సేదదీరడానికి అనువైన ఏడు పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన క్లుప్తమైన వివరాలు మీ కోసం...

చేంబ్రా పర్వత శిఖరం, వాయనాడ్

చేంబ్రా పర్వత శిఖరం, వాయనాడ్

P.C: You Tube

గాడ్స్ ఓన్ కంట్రిగా పేరుగాంచిన కేరళలో చింబ్రా పర్వత శిఖరం ఉంది. వాయనాడ్ జిల్లాల్లోని ఈ పర్యాటక కేంద్రం సముద్ర మట్టానికి 2,100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వర్ష బుుతువులో ఇక్కడి పరిసర ప్రాంతాలు పచ్చగా ఉంటూ మనసును మైమరిపింపజేస్తాయి. ఇది ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ట్రెక్కింగ్ కు కూడా చాలా అనుకూలం.

హొగనేకల్ జలపాతం

హొగనేకల్ జలపాతం

P.C: You Tube

తమిళానాడులోని ధర్మపురి జిల్లాలో ఈ హొగనేకల్ జలపాతం ఉంది. కావేరి నదీ వల్ల ఏర్పడిన ఈ జలపాతం ఈ వర్ష బుుతువులు చాలా వేగంగా కఠిన శిలల పై నుంచి కిందుకు దుముకుతూ ఉంటుంది. ఈ సమయంలో నీటి తెంపరులు తెల్లటి పొగవలే కనిపిస్తాయి. అందువల్లే దీనికి హొగనే కల్ అని పేరు వచ్చింది. కన్నడలో హొగ అంటే పొగ, కల్లు అంటే శిల లేదా రాయి. అని అర్థం. పేరుకు తమిళనాడు అయినా ఈ జలపాతం బెంగళూరుకు చాలా దగ్గర. అందువల్లే శని, ఆదివారాల్లో హొగనేకల్ జలపాతం వద్ద ఎక్కువగా ఉద్యానగరి వాసులు కనిపిస్తూ ఉంటారు.

కబిని

కబిని

P.C: You Tube

వన్యప్రాణులను దగ్గర నుంచి చూడాలనుకొనే వారికి కబిని అటవీ ప్రాంతం అత్యంత అనువైన చోటు. ఇక్కడ ఏనుగులు, పులులను సంరక్షించే అభయారణ్యాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ కబిని అడవి మరింత అందంగా తయారవుతుంది. వర్షాకాలంలో నెమలి నృత్యాలు ఇక్కడ సర్వసాధారణం. అందువల్ల బెంగళూరు నుంచే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వర్షాకాలంలో ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు.

దక్షిణ భారతదేశ చిరపుంజి ఆగుంబే

దక్షిణ భారతదేశ చిరపుంజి ఆగుంబే

P.C: You Tube

కర్నాటకలోని ఆగుంబేను దక్షిణ భారత దేశ చిరపుంజి అని పిలుస్తారు. అధిక వర్షాపాతం నమోదు చేయడం వల్లే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఆగుంబే ట్రెక్కింగ్ కు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో జలపాతాలు అడుగడుగునా కనిపిస్తాయి. వర్షాకాలంలో వాటి హొయలు చూడాల్సిందే. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటైన కింగ్ కోబ్రా ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల ట్రెక్కింగ్ సమయంలోకొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.

హర్ల్సీ హిల్స్

హర్ల్సీ హిల్స్

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ ఊటీగా హర్ల్సీ హిల్స్ కు పేరు. ఇది ప్రముఖ హిల్ స్టేషన్ కూడా. తూర్పుకనుమల్లోని ఈ ప్రాంతం పడుతున్న వర్షాలకు నూతన అందాలను సంతరించుకొని పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తోంది. ట్రెక్కింగ్ కు కూడా అనుకూలం. 1859 సంవత్సరం నాటి నీలగిరి చెట్టు ఏపుగా పెరిగి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+