Search
  • Follow NativePlanet
Share
» »బైలకుప్పే లో ఏమి చూడాలి ?

బైలకుప్పే లో ఏమి చూడాలి ?

బైలకుప్పే ఒక అతి పెద్ద టిబెట్ దేశీయుల నివాస స్థలం. టిబెట్ దేశం తర్వాత ఈ ప్రదేశం వారికి చెందిన అతి పెద్ద వలస స్థావరంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ సుమారు ఇరవై గ్రామాలలో వీరు నివసిస్తున్నారు. అనేక ఆరామాలు, విద్యా సంస్థలు వారికి కలవు.

మీరు ప్రశాంత సెలవులు అందమైన వాతావరణం కోరే వారైతే, బైలకుప్పే సందర్శించండి. ఈ ప్రదేశం బెంగుళూరు కు 214 కి. మీ. ల దూరంలో కలదు. సుమారు నాలుగు గంటల రోడ్డు ప్రయాణంలో దీనిని చేరవచ్చు.

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

బైలకుప్పే ఎలా చేరాలి ?
బైలకుప్పే బెంగుళూరు నుండి కూర్గ్ వెళ్ళే మార్గంలో కలదు. బస్సు లు, ఇతర వాహనాలలో రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు. బెంగుళూరు నుండి అయిదు గంటలు, మంగళూరు నుండి రెండున్నర గంటలలో ఈ ప్రదేశం చేరవచ్చు.

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

బైలకుప్పే

టిబెట్ స్థావరాలు కాక ఇక్కడ మీరు ప్రసిద్ధ నాం ద్రోల్లింగ్ మొనాస్టరీ, చూడవచ్చు. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ ప్రసిద్ధి. ఈ ఆరామంలో మూడు రాగి మరియు బంగారు పూత కల బుద్ధుడి విగ్రహాలు గోల్డెన్ టెంపుల్ లో కలవు. ఈ సముదాయంలో ఇంకనూ ఇతర టెంపుల్స్ కూడా కలవు. బౌద్ధ సన్యాసినుల, మరియు సన్యాసుల వసతులు కూడా కలవు. టిబెట్ హస్త కళా వస్తువులతో కొన్ని షాపులు కూడా చూడవచ్చు.
Photo Courtesy: Ashok666

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

సెరా మొనాస్టరీ
ఈ ఆరామంలో రెండు శాఖల ఆరామాలు కలవు. అవి సెరా జీ మరియు సెరా మీ. ఈ మొనాస్టరీ లు నాం ద్రోల్లింగ్ మొనాస్టరీ కి సుమారు మూడు కి. మీ. ల దూరంలో కలవు. ఈ ప్రదేశంలో సందర్శకులు తక్కువ సంఖ్యలో వస్తారు. ప్రతి సాయంకాలం బౌద్ధ సన్యాసులు, ఏదో ఒక అంశంపై చర్చలు చేయటం గమనించవచ్చు.
Photo Courtesy: Bilal M Jafri

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

ఏమి చేయాలి
బలం కలిగి భక్తి వున్నవారు అక్కడ కల ప్రార్థనా చక్రాలు తిప్పవచ్చు. ఈ చక్రాల పై ప్రార్ధనలు వుంటాయి. వేరే వారి కష్టాలు తొలగించాలనుకునే వారు వారిని తలుచుకుంటూ ఈ చక్రాలను తిప్పితే, వారి కష్టాలు తొలగిపోతాయని చెపుతారు. టిబెట్ బౌద్ధ మతం, ఎలా అభివృద్ధి అయిందనేది ఇక్కడ వివరిస్తారు.

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

షాపింగ్ ఇక్కడ ఎలా ?
షాపింగ్ కు రెండు మార్కెట్ లు కలవు. ఒకటి కేంప్ 1 కాగా మరొకటి నాం ద్రోల్లింగ్ మొనాస్టరీ మెయిన్ గేట్ వద్ద కలదు. షాపింగ్ తర్వాత, తగిన ధరలో రుచికర భోజనం చేయవచ్చు. ఇక్కడ మొనాస్టరీ కాంప్లెక్స్ వెలుపల రెస్టారెంట్ లు కలవు. పొగ తాగుట , ఆల్కహాలు ఈ మొనాస్టరీ ఆవరణలో నిషేధించ బడ్డాయి.
Photo Courtesy: Bilal M Jafri

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

వసతి
బైలకుప్పేలో ఉండాలనుకునే వారు ముందుగా ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ తీసుకోవాలి. చాలామంది సందర్శకులు ఇక్కడ వుండరు. పక్కనే కల కూర్గ్ ప్రదేశానికి వెళ్ళిపోతారు. సమీపంలో కల ఇతర ఆరామాలు చూడాలనుకుంటే, ఇక్కడే ఒక గెస్ట్ హౌస్ కలదు. గదులు చాలా సింపుల్ గా వుంటాయి. టెలివిజన్ కూడా వుండదు.
Photo Courtesy: Bilal M Jafri

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

ఆహారాలు
టిబెట్ రెస్టారెంట్ లు ఇక్కడ సాయంత్రం ఏడు గంటలకు మూసివేస్తారు. కనుక ఆ లోపే మీరు టిబెట్ ఆహారాలు రుచి చూడాలి. నాం ద్రోల్లింగ్ మొనాస్టరీ సమీపంలో రెండు ఇండియన్ రెస్టారెంట్ లు కలవు. ఇవి మాత్రం రాత్రి తొమ్మిది గంటల వరకూ తెరచి వుంటాయి.
Photo Courtesy: Bilal M Jafri

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

ప్రశాంత సెలవులు - అందమైన పరిసరాలు!

బైలకుప్పే తర్వాత ఏమి చూడాలి ?
బైలకుప్పే సందర్శన తర్వాత మీరు నేరుగా ప్రసిద్ధ కూర్గ్ ప్రాంతానికి వెళ్ళవచ్చు.
Photo Courtesy: Bilal M Jafri

కూర్గ్ ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+