Search
  • Follow NativePlanet
Share
» »అద్భుత‌మైన క‌ట్ట‌డాల‌కు నిద‌ర్శ‌నం.. హైద‌రాబాద్‌లోని ఈ ప్యాలెస్‌లు!

అద్భుత‌మైన క‌ట్ట‌డాల‌కు నిద‌ర్శ‌నం.. హైద‌రాబాద్‌లోని ఈ ప్యాలెస్‌లు!

ఈ సీజ‌న్‌లో చాలామంది చల్లని ప్ర‌దేశాల‌కు లేదా హిల్‌స్టేష‌న్‌ల‌కు వెళ్లాల‌నుకుంటారు. అయితే, అద్భుత‌మైన నిర్మాణ క‌ట్ట‌డాల‌ను, అదికూడా ఎంతో చ‌రిత్ర కలిగిన క‌ట్ట‌డాల‌ను చూడాలుకునేవారు త‌ప్ప‌కుండా ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీ అస్స‌లు మిస్ కావొద్దు. ఇది హైద‌రాబాద్ వ‌న్‌డే ట్రిప్. తెలంగాణ రాష్ట్రంలోని హైద‌రాబాద్ పట్ట‌ణంలోని నిజాం ప్యాలెస్‌ల‌ను వీక్షించేందుకు తెలంగాణ టూరిజం అందిస్తోన్న స్పెష‌ల్ ప్యాకేజీ. హైదరాబాద్ న‌గ‌రానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప‌ట్ట‌ణంలోని పాత కట్టడాలు అద్భుత ఇంజినీరింగ్‌కు అద్దం పడతాయి.

హైదరాబాద్ నగరంలోని అద్భుత కట్టడాల్లో.. ఫలక్‌నుమా ప్యాలెస్ పేరు ముందువ‌రుస‌లో ఉంటుంది. ఇది చార్మినార్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫలక్ నూమా అంటే ఆకాశ దర్పణం అని అర్థం. ఇది మొత్తం 32 ఎక‌రాల్లో విస్త‌రించి ఉంది. దీనిని ఆరవ నిజాం మామ వికారుల్ ఉమ్రా అప్పట్లో 60 లక్షలు వెచ్చించి మ‌రీ నిర్మించాడు. ఈ ప్యాలెస్‌లో మొత్తం 60 గదులు, 22 విశాల హాళ్లు, బంగారం, క్రిస్టల్ తో తయారుచేసిన డైనింగ్ టేబుల్ వంటివ‌న్నీ ఉన్నాయి. ఈ డైనింగ్ టేబుల్ చాలా పెద్ద‌ది. దీనిపై సుమారు 100 మంది దాకా కూర్చొని తినొచ్చు. ఇంకా ఇక్క‌డ లైబ్రరీ, బ్రిలియర్డ్స్ టేబుల్ లు కూడా ఉన్నాయి.

nizampalaces

ఇంకా ఇక్క‌డి అద్భుత క‌ట్ట‌డాల్లో మ‌రో ప్ర‌దేశం చౌహముల్లా ప్యాలెస్. తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ ప్యాకేజీలో ముందుగా ఈ ప్యాలెస్‌ను వీక్షిస్తారు. అనంత‌రం ఫలక్ నూమా ప్యాలెస్ సంద‌ర్శ‌న ఉంటుంది. ఇక‌, చౌమహల్లా ప్యాలెస్ ను 18 వ శతాబ్దం లో నిర్మించారు. ఈ ప్యాలెస్ లో ఖరీదైన వస్తువులు, ఆయిల్ పెయింటింగ్ లు, దర్బార్ హాళ్లు వంటివెన్నో ఉన్నాయి. ఈ ప్యాలెస్ నిర్మాణానికి సుమారు ప‌ది సంవత్సరాలు పట్టిందట‌. న‌గ‌రంలోని ఈ అద్భుత‌మైన క‌ట్ట‌డాల సంద‌ర్శ‌న‌కు తెలంగాణ టూరిజం ఓ ప్ర‌త్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. వ‌న్ డే ట్రిప్‌తోనే ఈ టూర్ ముగుస్తోంది. ఈ టూర్ విశేషాలు తెలుసుకుందాం ప‌దండి.

నిజాం ప్యాలెస్ టూర్ షెడ్యూల్‌..

తెలంగాణ టూరిజం Nizam Palaces Tour పేరుతో ఓ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ప్ర‌తి రోజు ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. వ‌న్‌డే ట్రిప్ ఇది. ముందుగా హైద‌ర‌బాద్‌లోని మ‌ధ్యాహ్నం 12.00 pm స‌మ‌యంలో బేగంపేట్ లోని టూరిజం ప్లాజా నుంచి బస్సు బయల్దేరుతుంది. అక్క‌డినుండి 12.15 pm స‌మ‌యానికి తాజ్ కృష్ణకు చేరుకుంటుంది.

falaknumapalace

అక్క‌డినుండి 12.45 pm ట్యాంక్ బండ్ కు బ‌య‌లుదేరుతుంది. ఈ టూర్‌లో భాగంగా ముందుగా చౌహ‌ముల్లా ప్యాలెస్ సంద‌ర్శ‌న ఉంటుంది. ఆ ప్యాలెస్ అందాల‌ను చూసిన త‌ర్వాత త ఫలక్ నుమా ప్యాలెస్‌కు ప్ర‌యాణం ఉంటుంది. ఈ ప్యాలెస్‌ను 7వ నిజాం త‌న 'రాయల్ గెస్ట్ హౌస్‌'గా వినియోగించుకున్నారు. ఈ ప్యాలెస్ అందాల‌తో పాటు ఈ పురాత‌న క‌ట్ట‌డాల వెనుక దాగి ఉన్న చ‌రిత్ర‌ను కూడా తెలుసుకోవ‌చ్చు.

chowmahallapalace Hyderabad

ప్యాకేజీ ధ‌ర‌లు..

ఈ ప్యాకేజీ ధరల విష‌యానికిస్తే.. పెద్ద‌ల‌కయితే రూ. 2400 చెల్లించారు. అదే చిన్నారులకయితే రూ. 1920 చెల్లించాల్సి ఉంటుంది. ఇది బ‌స్సు జ‌ర్సీ. ఎసీ బ‌స్సులో ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. వ‌న్ డే ట్రిప్‌తో ఈ అద్భుత‌మైన క‌ట్ట‌డాల‌ను వీక్షించొచ్చు. మరెందుకాల‌స్యం మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి మ‌రి. ప్ర‌యాణికులు ఇత‌ర పూర్తి స‌మాచారం కోసం https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+