Search
  • Follow NativePlanet
Share
» »ఉద్య‌మ చ‌రిత్ర‌కు నిద‌ర్శ‌నం.. జ‌లియ‌న్ వాలాబాగ్‌..!

ఉద్య‌మ చ‌రిత్ర‌కు నిద‌ర్శ‌నం.. జ‌లియ‌న్ వాలాబాగ్‌..!

ఉద్య‌మ చ‌రిత్ర‌కు నిద‌ర్శ‌నం.. జ‌లియ‌న్ వాలాబాగ్‌..!

అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలలో ఒకటి. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో పంజాబ్‌లోని జ‌లియ‌న్ వాలాబాగ్ ప్ర‌దేశానికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ప్ర‌దేశాన్ని చూసొద్దామా. 26,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం 1919లో జలియన్‌వాలాబాగ్ ఊచకోత జరిగిన ప్రదేశం. నేడు, ఈ ఉద్యానవనం జాతీయ స్మారక చిహ్నంగా పేరుగాంచింది. ఇక్క‌డి ఉద్యాన‌వ‌నంలోని గోడ‌లు ఇప్ప‌టికి బుల్లెట్ రంధ్రాలతో మార్క్ చేయ‌బ‌డ్డాయి. ఇక్క‌డి స్మారక ఫలకాలు ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు ఊచకోత సంఘటనలను వివరిస్తాయి. మ‌రెందుకాల‌స్యం ఇంత‌టీ చ‌రిత్ర క‌లిగిన ఈ ప్రాంతాన్ని చూసేద్దాం రండి..

1

జలియన్ వాలా బాగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు

జ‌లియ‌న్ వాలాబాగ్ ప్ర‌వేశ ద్వారం వెలుపల తెల్లటి పాలరాయితో చేసిన శిల్పం ఉంటుంది. దీనికి వేర్వేరు ముఖాలు చెక్కబడ్డాయి. ఈ డిజైన్ మొత్తం పైకి వెళ్లే పొగలాగా ఉంటుంది. ఇక్క‌డే ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన "అమరవీరుల" పేర్లు బంగారంతో రాయ‌బ‌డిన అక్ష‌రాల‌ను మ‌నం చూడొచ్చు. అంతేకాకుండా ఇక్క‌డ అమృత్‌స‌ర్ ఊచ‌కోత‌కు గుర‌యిన ఉధమ్ సింగ్ విగ్రహం కూడా క‌నిపిస్తుంది. జ‌లియ‌న్ వాలాబాగ్ ఉద్యాన‌వ‌నం ఇక్క‌డి ప్ర‌ముఖ ప్ర‌దేశాల‌లో మ‌రొక‌టి. దీని లోప‌ల‌కి ప్ర‌వేశించాలంటే ఇరుకైన ప్రవేశ ద్వారం గుండా వెళ్లాల్సిందే. జనరల్ డయ్యర్, అతని దళాలు ఉపయోగించిన మార్గం ఇదే.

ఈ మార్గం గుండా న‌డిచిన‌ప్పుడు ఏదో తెలియ‌ని భావోద్వేగానికి గుర‌వుతాం. ఈ పార్క్ గోడ‌ల‌పై హింస‌కు సంబంధించిన బుల్లెట్ గుర్తులు ఉంటాయి. ఇవి తెలుపు పెయింట్ ద్వారా హైలైట్ చేయబడి ఉంటాయి. మొత్తం 36 బుల్లెట్ గుర్తులు ఉంటాయి. ఇక్క‌డ మ‌రొక ప్రాంతం అమరవీరుల బావి. క్రూరమైన కాల్పుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో చాలా మంది దూకిన బావి ఇది. ఈ బావి సంర‌క్ష‌ణార్ధం చుట్టూ ఆలయం వంటి నిర్మాణం ఉంది.

2

ఫ్లేమ్ ఆఫ్ లిబర్టీ

ఇది జలియన్‌వాలా బాగ్ స్మారక చిహ్నం. ఇది త్యాగాలను గుర్తుచేసుకునేందుకు, అమరవీరుల గౌరవార్థం నిర్మించబడింది. ఇది మంట రూపంలో రూపొందించబడిన ఎర్రటి స్మారక చిహ్నం. అప్ప‌టి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ 1961లో ఈ జలియన్ వాలాబాగ్ స్మారకాన్ని ప్రారంభించారు. అమరవీరుల గ్యాలరీ, మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది ఒక చిన్న ఎగ్జిబిషన్ గది. ఇందులో విషాద సంఘటనకు సంబంధించిన ఫోటోలు, డాక్యుమెంటరీలు, కళాకారుల ప్రదర్శనలు ఉన్నాయి.

సంద‌ర్శన సమ‌యం

జ‌లియన్ వాలా బాగ్ ప్రతి రోజు ఉదయం 6:30 నుండి రాత్రి 7:30 వరకు తెరిచి ఉంటుంది. జలియన్‌వాలా బాగ్‌కు ఎటువంటి ప్ర‌వేశ రుసుము లేదు. ఏడాది పొడవునా ఈ ప్ర‌దేశాన్ని సందర్శించవచ్చు.

జలియన్ వాలా బాగ్ చేరుకోవడం ఎలా

రోడ్డు మార్గం ద్వారా అయితే అంబాలా, పాటియాలా, చండీగఢ్ మరియు ఢిల్లీ బస్ స్టాప్ జలియన్ వాలా బాగ్ నుండి కేవలం 2 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్నాయి. రైల్వే జంక్షన్ అమృత్‌సర్‌ను ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్ మరియు కోల్‌కతాతో సహా ప్రధాన భారతీయ నగరాలకు కలుపుతుంది. స్టేషన్ 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమాన మార్గం ద్వారా అయితే 15 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం అమృత్‌స‌ర్‌కు స‌మీప విమాన‌శ్ర‌యం.

More News

    Read more about: jallianwala bagh punjab
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+