Search
  • Follow NativePlanet
Share
» »కోస్తా తీర అందాలు - కోరినన్ని బీచ్ లు !

కోస్తా తీర అందాలు - కోరినన్ని బీచ్ లు !

కోస్తా తీర దృశ్యాలు చూస్తూ రోడ్డు ప్రయాణాలు చేసి ఆనందించని వారు సాధారణంగా ఎవరూ వుండరు. మీరు కనుక రోడ్ ట్రావెల్ ఇష్టపడి, ఆనందిన్చాలనుకునే వారైతే, ఇండియా లో ఎన్నో రూట్ లు కలవు. లెహ్ - మనాలి రోడ్, డెహ్రాడూన్ లోని రోడ్లు, కొడైకెనాల్ - మున్నార్ రోడ్ మొదలైనవి కొన్ని. సరిగా ఇంత కంటే అందమైన మార్గాలు కొన్ని తమిల్ నాడు లోని కోస్తా తీరంలో కలవు. బంగాళా ఖాతం తీరం వెంబడి ప్రయాణించే ఈ మార్గం అనేక సైట్ సీయింగ్ ప్రదేశాలను, అద్భుత దృశ్యాలను ప్రయాణం మార్గం అంతా చూపుతుంది. ఈ మార్గాన్ని స్టేట్ హై వే 49 అని కూడా అంటారు. ఈ మార్గం, చెన్నై నుండి తూతుకుడి వరకు తీసుకు వెళుతుంది.

ఈ ప్రయాణ మార్గంలో మీరు చిదంబరం, కరైకల్, నాగపట్టినం, నాగోర్, రామనాథపురం పట్టణాలు చూడవచ్చు. ఈ జర్నీ మొత్తంగా 690 కి. మీ. ల వరకూ వుంటుంది. తూతుకుడి నుండి కన్యాకుమారి వరకూ రోడ్డు మార్గాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికి గాను సుమారు రూ. 257 కోట్లను బడ్జెట్ గా కేటాయించినది.

కోస్తా రోడ్డు పర్యటన

కోస్తా రోడ్డు పర్యటన

చెన్నై నుండి తూతుకుడి వెళ్ళే మార్గంలో తమిళ్ నాడు లోని అందమైన ఆకర్షణలు కొన్ని కనపడతాయి. వీటిలో మీరు మిస్ కాకూడని టెంపుల్స్, మ్యూజియం లు, ఇతర ప్రదేశాలు కొన్ని కలవు. ఈ సుదీర్ఘ ప్రయాణ వివరాలు దిగువ ఇస్తున్నాం చూడండి.

కోస్తా రోడ్డు పర్యటన

కోస్తా రోడ్డు పర్యటన

చెన్నై నుండి 25 కి. మీ. లు ప్రయాణించిన తర్వాత మనం దక్షిణ చిత్ర చేరతాం. ఇది ఒక మ్యూజియం, దీనిలో దక్షినాది రాష్ట్రాలైన, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళ్ నాడు రాష్ట్రాల కళలు, సంగీతం, సంస్కృతి, వారసత్వం మొదలైనవి కనపడతాయి. ఈ మ్యూజియం ను 1996 లో మద్రాస్ క్రాఫ్ట్ ఫౌండేషన్ స్థాపించినది.

 కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

శివ భగవానుడి గుడి అయిన ఈ దేవాలయం చెన్నై కి సమీప తిరువాన్మియూర్ లో కలదు. ఈ టెంపుల్ ను దీర్ఘకాల వ్యాధులు కలవారు దర్శించి నివారణ చేసుకుంటారు. ఈ దేముడు అద్భుత మహిమ కలవాడని తమ కోరికలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. ఈ టెంపుల్ ఒక ఎకరం భూమిలో రెండు ప్రవేశ గోపురాలు, ఒక కోలనుతో కలదు. ఈ టెంపుల్ తూర్పు కోస్తా వాస్తవంగా మొదలు అయ్యే అడయార్ కు 4 కి. మీ. కల దూరం లో కలదు.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

ప్రశాంతమైన ఈ చిన్న విలేజ్ లో అత్యధిక సంఖ్యలో కళాకారులు కలరు. ఈ సంస్థ 1966 సంవత్సరంలో అప్పటి మద్రాస్ స్కూల్ అఫ్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్ అయిన కే.సి. పానికర్ అధ్వర్యంలో స్థాపించబడింది. 1970 ల నాటికి ఇండియా లో అంతర్జాతీయ కాలాకారుల సంఘాల మీటింగ్ ప్రదేశం గా రూపు దిద్దుకొంది. ఈ ఆకర్షణీయ ప్రదేశాన్ని తప్పక చూడండి.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

ఈ టెంపుల్ శోలింగానల్లూర్ లోని అక్కరాయి లో కలదు. దీనిని 2012 ఏప్రిల్ లో స్థాపించారు. ఇది తమిళ్ నాడు లో అతి పెద్ద రాదా కృష్ణ టెంపుల్. ఈ టెంపుల్ ఆవరణ విస్తీర్ణం 1.5 ఎకరాలు కలదు.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

బ్యాక్ వాటర్ కల ఈ ప్రదేశం అడయార్ నుండి 23 కి. మీ. ల దూరం ఈ ప్రదేశంలో స్కై ఇంగ్ , స్పీడ్ బోటు రైడింగ్, విండ్ సర్ఫింగ్, రోయింగ్ వంటి సాహస క్రీడలు ఆచరిస్తారు. ఈ ప్రదేశం తమిళ్ నాడు టూరిజం కార్పొరేషన్ నిర్వహిస్తోంది.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

ముస్లిం ల ఈ పుణ్య క్షేత్రం కోవలాంగ్ లో కలదు. అందరూ ఆసక్తి కల ప్రదేశం. తమీం అన్సారి మదీనా లో జన్మించాడు. ఈయన ప్రోఫెట్ మహమ్మద్ మరియు అతని వారసుల అనుచర భక్తుడు. తమీం మరణాంతరం ఆయన అస్థికలు ఒక శవ పేటికలో పెట్టి అతని కోరిక మేరకు సముద్రంలో ఇక్కడ వదిలారు. అయితే, ఆ శవ పేటిక, కోవలోంగ్ తీరం విడచి వెళ్ళాక అక్కడ వుంది పోగా అక్కడ ఒక దర్గా ఏర్పరిచారు.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

కొవ్ లాంగ్ ఒక మత్స్యకారుల గ్రామం. చెన్నై నుండి సుమారు 40 కి. మీ. లు, మహాబలిపురం నుండి 26 కి. మీ. ల దూరం లో కలదు. ఈ ప్రదేశంలో మీరు రిలాక్స్ అయి స్నాక్స్ వంటి ఆహారాలు తినవచ్చు.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

టైగర్ కేవ్ వాస్తవానికి ఒక హిందూ టెంపుల్. తమిల్ నాడు లోని మహాబలిపురం సమీపంలో కలదు. కొండ గుహలో కల ఈ టెంపుల్ సుమారు 8 వ శాతాబ్దానిడిగా చెపుతారు. దీనిని పల్లవ రాజులు నిర్మించారు. శతాబ్దాల కిందటి, చెక్కడాలు, శిలా శాశనాలు మీరు ఇక్కడ చూడవచ్చు.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

మహాబలిపురం ఒక యునెస్కో ప్రపంచ వారసత్వ సైట్. ఇది రాళ్లవ రాజుల పాలనలో రూపు దిద్దుకొంది ఈ తీర దేవాలయాలు పల్లవ రాజుల కలాభిమానానీకి చిహ్నంగా వుంటాయి.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

క్రొకోడైల్ బ్యాంకు అంటే మొసళ్ళ స్థావరం మహాబలిపురానికి 14 కి. మీ. ల దూరంలో కలదు. దీనిలో మొసళ్ళు, పాములు, వుంటాయి. సుమారు 5000 రకాల జీవాలు బహిరంగంగా తిరుగుతూంటాయి. మీరు వీటిని దూరం నుండి రక్షిత ప్రదేశంలో చూసి ఆనందించవచ్చు.

కోస్తా రోడ్డు పర్యటన

కోస్తా రోడ్డు పర్యటన

అలమ్పరాయి ఫోర్ట్ నేడు శిదిలావస్తలో కలదు. ఈ ఫోర్ట్ మహాబలిపురం నుండి 50 కి. మీ. ల దూరం లో కల ఒక విలేజ్ కదప్పక్కం లో కలదు. ఈ ఫోర్ట్ ను మొగలుల కాలంలో సుమారు 17 వ శతాబ్దం లో నిర్మించారు. ఈ కోట 2004 సంవత్సరంలో వచ్చిన సముద్ర భూకంపంలో ధ్వంసం అయ్యింది.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

పాండిచేరి బీచ్ ల గురించి చెప్పవలసిన పని లేదు. ఫ్రెంచ్ కాలనీ అయిన ఈ ప్రదేశం ఈస్ట్ కోస్ట్ రోడ్ లో విస్తరించి అనేక అందమైన బీచ్ లు కలిగి వుంది.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

బంగాళా ఖాతా తీరాన కల ఈ కడలూర్ పట్టణం చాలా అందమైనది. అనేక ప్రకృతి దృశ్యాలు వీక్షించవచ్చు. ఈ ప్రదేశంలో అందమైన టెంపుల్స్, బీచ్ లు, ఇతర సహజ పరిసరాలు కలవు.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

కరైకల్ ను దేవాలయాల పట్టణం అని కూడా పిలుస్తారు. ఈ ఓడ రేవు పట్టణం చెన్నై మరియు తూతుకుడి పట్టణాల మధ్య కలదు. ఇక్కడ కల టెంపుల్స్, మరియు బీచ్ లు ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తాయి.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

నాగోర్ కరైకల్ ప్రదేశానికి దక్షిణంగా 16 కి. మీ. ల దూరంలో కలదు. తమిళ్ నాడు లో ఇది ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. ఈ ప్రదేశం లోని నాగోర్ దర్గా ఒక ప్రసిద్ధ ఆకర్షణ.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

తూర్పు కోస్తా మార్గంలో కల వేదారణ్యం ఒక టెంపుల్ టవున్. ఈ టవున్ కు మరొక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన వేలన్కాన్ని నుండి తేలికగా చేరవచ్చు.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

మీ తూర్పు కోస్తా పర్యటనలో ముతుపేట్ లగూన్ ను బంగాళా ఖాతం లో కల కావేరి నది డెల్టా దక్షిణ చివరి భాగంలో చూస్తారు. ఇక్కడ కల అందమైన అడవీ ప్రాంతం మీ పర్యటనకు అర్ధం చేకూరుస్తుంది.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

మనోరా కోట, తమిళ్ నాడు లోని తంజావూర్ జిల్లాలో కల మల్లిపట్టినం అనే ఒక కోస్టల్ విలేజ్ లో కలదు. ఎనిమిది అంతస్తులు కలిగి ఆరు కోణాలతో కల ఈ టవర్ ఎంతో హుందాగా బంగాళా ఖాతం చూస్తూ వుంటుంది. ఈ కోట నుండి భూ గర్భం లో ఒక సొరంగం 65 కి. మీ.క్ ల దూరంలో కల తంజావూర్ చేరేందుకు వున్నదని చెపుతారు.

కోస్తా తీర రోడ్డు పర్యటన

కోస్తా తీర రోడ్డు పర్యటన

తూతుకుడి నే తూటికోరిన్ అని కూడా అంటారు. ఇక్కడితో మీ పర్యటన ముగుస్తుంది. ప్రసిద్ధి చెందినా ఈ ఓడరేవు పట్టణం ను 'ముత్యాల నగరం' అని కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు హెర్ ఐలాండ్, హార్బర్ బీచ్, కొరకై వంటి కొన్ని ప్రసిద్ధ ఆకర్షనలను చూడవచ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+