Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కన్యాకుమారి

కన్యాకుమారి - అద్భుత సూర్యోదయాలు మరియు సూర్యాస్తమయాలు

36

గతం లో 'కేప్ కొమరిన్' గా ఖ్యాతి చెందినా కన్యాకుమారి తమిళ్ నాడు లో కలదు. ఈ పట్టణం ఇండియా కు దక్షిణ భూభాగా దిశా లో కోన లో వుంది. కన్యాకుమారి ప్రాంతం లో అరేబియన్ సముద్రం మరియు బంగాళా ఖాతం రెండూ కలుస్తాయి. దీనికి వాయువ్యం మరియు పడమర లో కేరళ రాష్ట్రం వుంటుంది. ఉత్తరం వైపు మరియు తూర్పున తిరునల్వేలి జిల్లా వుంటుంది. కేరళ రాజధాని అయిన తిరువనంతపురం ఇక్కడకు 85 కి.మీ. ల దూరం లో కలదు. కన్యాకుమారి పట్టణం సూర్యోదయాలకు మరియు సూర్యాస్తామయాలకు ప్రసిద్ధి. ప్రత్యేకించి పౌర్ణమి రోజులలలో ఈ ప్రాంతం చాలా అందంగా వుంటుంది.

టెంపుల్స్ మరియు బీచ్ లు - కన్యాకుమారి లోను మరియు చుట్టుపట్ల కల ఆకర్షణలు

సృజనాత్మక మైండ్ లేని వారు ఈ టవున్ యొక్క కళలను మరియు సంస్కృతి ని ఆనందించలేరు. అయితే, కన్యాకుమారి లో అనేక టెంపుల్స్ మరియు బీచ్ లు కలవు . ఇవి యాత్రికులను, పర్యాటకులను బా గా ఆకర్షిస్తాయి. సిటీ లో ప్రధాన ఆకర్షణలు అంటే, అవి వివేకానంద రాక్ మెమోరియల్, వత్తకోట్టై ఫోర్ట్, పద్మనాభపురం పలద్సు, తిరువల్లువార్ విగ్రహం, వవతురాయి, ఉదయగిరి ఫోర్ట్ మరియు గాంధీ మ్యూజియం.

టవున్ లోని ప్రసిద్ధ ప్రదేశాలలో కన్యాకుమారి టెంపుల్, చితరాల్ హిల్ టెంపుల్ మరియు జైన స్మారకాలు , నాగరాజా టెంపుల్, సుబ్రమణ్య టెంపుల్ మరియు తిరునందికరాయి కేవ్ టెంపుల్ కలవు.

తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వినోద పర్యటనకు వచ్చే వారికి కన్యాకుమారి లో కల బీచ్ లు ప్రధాన ఆకర్షణలు. ఈ బీచ్ లలో సంగుతురాయి బీచ్, తేన్గాపట్టినం బీచ్ మరియు సొత విలి బీచ్ లు ప్రసిద్ధి.

కేప్ కొమరిన్ చరిత్ర.

కన్యాకుమారి మతానికి మరియు కాలాలకు ప్రధాన కేంద్రాలే కాదు, ఇది వర్తక వ్యాపారాలకు కూడా గత కొన్ని శతాబ్దాల నుండి ప్రసిద్ధి. ఈ టవున్ ను ఎన్నో రాజ వంశాలు పాలించాయి. వాటిలో పాండ్యులు, చొళులు, నాయక లు, చేరాలు ప్రధానమైనవి. కన్యాకుమారి టెంపుల్స్ యొక్క శిల్ప సంపద చూసిన వారికి ఈ ప్రాంత కాలాలకు, నాగరికతకు నిదర్శనాలు గా చెప్పవచ్చు.

ఈ టవున్ వేనాడ్ వంశ పాలనకు వచ్చే సమయానికి ఈ టవున్ రాజధాని పద్మనాభపురం లో కలదు. 1729 నుండి 1758 వరకు , పాలించిన అనిజం తిరునల్ మార్తాండ వర్మ అంటే వేనాడ్ చక్రవర్తి ట్రావెన్ కూర్ ను స్థాపించాడు. దానితో ఈ ప్రాంతం కన్యాకుమారి జిల్లా కిందకు వచ్చింది. సౌత్ ట్రావెన్ కూర్ గా ప్రసిద్ధి చెందింది.

పరావర్ రాజుల పాలన తర్వాత ఈ పట్టణం ట్రావెన్ కూర్ రాజులు చే బ్రిటిష్ అధీనం లో 1947 లో స్వాన్తంత్రం వచ్చే వరకూ పాలించా బడింది. 1947 లో ట్రావెన్ కూర్ ఇండియన్ యూనియన్ లో స్వ పరిపాలన కింద కలదు. ఈ పాలన ట్రావెన్ కూర్ రాజులు చేసారు.

ప్రజలు వారి కల్చర్

కన్యాకుమారి కాలాలకు, కల్చర్ కు, ఆర్దికతలకు మరియు చరిత్రకు వేలాది సంవత్సరాలుగా ప్రసిద్ధి. ఇక్కడ క్రైస్తవ, ఇస్లాం, హిందూ మతాలు కలసి మెలసి వుండటం తో ఒక మిశ్రమ సంస్కృతి గా ఏర్పడింది. గత కొన్ని శతాబ్దాలుగా, కన్యాకుమారి దాని వారసత్వ సంస్కృతి కారణంగా వేలాది పర్యాటకులను ఆకర్షిస్తోంది. అందమైన చర్చి లు, టెంపుల్స్, విగ్రహాలు మరియు మతపర స్తంభాలు పర్యాటకులకు ఆకర్షణగా వుంటాయి. టవున్ కు గల ఈ మిశ్రమ సంస్కృతి

దాని నిర్మాణాలు, కళలు, మరియు వంటలు లేదా ఆహారల లో కూడా ప్రతిబింబిస్తుంది. కన్యాకుమారి లోని సాంప్రదాయ డాన్స్ కథాకళి ఎంతో ప్రసిద్ధి. ఈ టవున్ లో జరిపే కొన్ని పండుగలు అంటే అవి కేథలిక్ చర్చి హోలీ వార్షిక ఫెస్టివల్, నవరాత్రి మరియు చైత్ర పూర్ణిమ.

కన్యాకుమారి లో షాపింగ్ ఎల్లపుడూ షాపింగ్ చేసే వారికి కన్యాకుమారి సరైన ప్రదేశం కాదు. అయితే కొట్టి పాటి గుర్తు కొరకు ప్రియమైన వారికి ఇవ్వగల కొన్ని వస్తువులు తప్పక దొరుకుతాయి. సముద్రపు ఆలిచిప్ప వంటి వి, సంఖాలు, మరియు చిన్న మోమెంతో లు దొరుకుతాయి. హస్త కళల వస్తువులు ఇక్కడ స్థానికులచే చేయబడినవి దొరుకుతాయి. అందమన ఈ కెన్ మరియు వెదురు, చెక్క ఉత్పత్తులు ఇంటి అలంకరణకు లేదా ఫ్రెండ్స్ లేదా బంధువులకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు బాగుంటాయి.

సి షెల్ల్స్ తో చేయబడిన కొన్ని నగలు రంగుల సముద్ర ఇసుక వంటివి కూడా షాపింగ్ లిస్టు లో చేర్చవచ్చు. సిటీ లో ప్రసిద్ధ షాపులు అంటే తమిళ్ నాడు కో ఆప టెక్స్ సేల్స్ ఎంపోరియం మరియు తమిళ్ నాడు క్రాఫ్ట్స్ అండ్ పూమ్పుహార్ లు. ఇక్కడ వివిధ టెక్స్ టైల్స్ మరియు హంది క్రాఫ్ట్ వస్తువులు కొనవచ్చు. రోడ్ల పై అమ్మే వస్తువులు సరసమైన ధరలలో వుంటాయి.

రుచి కర ఆహారాలు

సి ఫుడ్ లు కన్యాకుమారి స్థానికులకు ప్రసిద్ధి. ఈ ఆహారం అధిక మసాలా , కొబ్బరి వంటివి ప్రతి ఆహారం లోను కలిగి వుంటాయి. టవున్ లోని చాలా రెస్టారెంట్ లు సౌత్ ఇండియన్ డిష్ లు వడ, ఇడ్లి, దోస మరియు ఊతప్పం వంటివి అందిస్తారు. కన్యాకుమారి లో చైనీస్, రాజస్థాని, గుజరాతి ఆహారాలను అందించే కొద్దిపాటి రెస్ట రెంట్లు కూడా కలవు.

కన్యాకుమారి ఎలా చేరాలి ?

సిటీ కి సమీప ఎయిర్ పోర్ట్ తిరువనంతపురం లో కలదు. ఎయిర్ పోర్ట్ లో దిగి టాక్సీ లేదా బస్సు లేదా ట్రైన్ లో కన్యాకుమారి చేరవచ్చు. కన్యాకుమారి టవున్ లో ఆటో రిక్షాలు లేదా బస్సు లలో ప్రయాణించవచ్చు. లేదా ప్రైవేటు టాక్సీ కూడా అద్దెకు తీసుకోవచ్చు.

కన్యాకుమారి సందర్శనకు ఉత్తమ సమయం.

కన్యాకుమారి సందర్శనకు ఉత్తమ సమయం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు. ఈ సమయం లో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. అయితే ఈ ప్రదేశాన్ని జూన్ నుండి ఆగష్టు వరకూ వర్షాల కారణంగా చాలా అసౌకర్యం గా వుంటుంది.

కన్యాకుమారి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కన్యాకుమారి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కన్యాకుమారి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కన్యాకుమారి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం కన్యాకుమారి కి రోడ్డు మార్గాలు బాగానే వుంటాయి. పర్యాటకులు తేలికగా చేరవచ్చు. ఇండియా లోని అన్ని ప్రధాన నగరాలనుండి బస్సు లు కన్యాకుమారి కి కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం పర్యాటకులు కన్యాకుమారి కి రైలు లో చేరవచ్చు. ఇక్కడకు సూపర్ ఫాస్ట్ మరియు ఎక్స్ ప్రెస్ ట్రైన్ లు వివిధ ప్రదేశాలనుండి చేరతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం కన్యాకుమారి విమాన ప్రయాణం లో చేరాలంటే, సమీప ఎయిర్ పోర్ట్ 89 కి. మీ. ల దూరం లో తిరువనంతపురం లో కలదు. ఇక్కడ నుండి కన్యాకుమారి కి ఇంటర్నేషనల్ మరియు స్థానిక విమానాలు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed