Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చారిత్రాత్మక కోటల గతాన్ని ఒక్కసారి చూడండి

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చారిత్రాత్మక కోటల గతాన్ని ఒక్కసారి చూడండి

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చారిత్రాత్మక కోటల గతాన్ని ఒక్కసారి చూడండి

ఎన్నోఏళ్లుగా లెక్కలేనన్ని చారిత్రక ఘట్టాలను ఆంధ్రప్రదేశ్ చూసింది. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత సాంస్కృతికంగా సంపన్న రాష్ట్రాలలో ఒకటిగా పేరుపొందింది. సామ్రాజ్యాలను అధిగమించిన అల‌నాటి పాలకులను ప‌రిపాల‌నకు ఈ నిర్మాణాలు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అందుకే, ఆంధ్ర ప్రదేశ్ చారిత్రక కోటల సమూహానికి నిలయంగా చెబుతారు. అబ్బురప‌ర‌చే నిర్మాణ శైలి ఈ నిర్మాణాల సొంతం. మీరు చరిత్ర ప్రియులైతే, ఈ పురాతన కట్టడాలను త‌ప్ప‌క‌ అన్వేషించాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు చారిత్రక కోటల విశేషాల‌ను తెలుసుకుందాం.

vizianagaramfort1

విజయనగరం కోట

క్రీ.శ.1713లో విజయనగరం మహారాజు విజయ రామరాజు ఈ కోటకు పునాది వేశారు. చతురస్రాకారంలో ఉన్న ఈ కోటకు రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వీటిని రాజస్థానీ నిర్మాణ శైలిలో నిర్మించారు. తూర్పు ద్వారన‌ ఒకప్పుడు రాజ శాసనాలు, రాజ అతిథులరాకను ప్రకటించడానికి ఉపయోగించే డ్రమ్ టవర్. పశ్చిమ ద్వారన‌ పైన మంటపం, రాజ సమాధులకు ప్రవేశం ఉంది. మోతీమహల్‌ను రాజు III విజయరామరాజు నిర్మించారు. ప్రవేశ ద్వారం వద్ద రెండు పాలరాతి విగ్రహాలు ఉన్నాయి. ఈ కోట గతంలో ఒక కందకంతో చుట్టుముట్టబడి ఉంది. అది ఇప్పుడు పార్కుగా మార్చబడింది.

gandikotafort1

గండికోట కోట

గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. గండికోట పెన్నా నది జలాలచే చుట్ట‌బ‌డి ఉంటుంది. ఎర్రమల్ల కొండల గుండా ఉన్న అద్భుతమైన కనుమలు దీనిని ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మార్చాయి. కోట ప్రవేశ ద్వారంలో రంగనాథ స్వామి దేవాలయం ప్రధాన నిర్మాణ ఆకర్షణలుగా నిలుస్తుంది. పెన్నా జార్జ్ వ్యూపాయింట్ వరకు కూడా ఎక్కవచ్చు. లేదా పెన్నా నది ఒడ్డున క్యాంప్ చేయవచ్చు. వివిధ సాహస కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.

kondapallyfort1

కొండపల్లి కోట

18 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కొండపల్లి కోట విజయవాడలోని ఉత్తమ ఆకర్షణలలో ఒకటి. ఈ కోటలో మూడు అంతస్థుల రాతి గోపురం మరియు రెండు ప్రధాన ద్వారాలు, దర్గా దర్వాజా మరియు గోల్కొండ దర్వాజా ఉన్నాయి. రెండు కొండల మధ్య శిఖరంపై ఉన్న తానీషా మహల్ చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. కోట ప్రాంగణంలో గజసాల, క్వీన్స్ ప్యాలెస్, విరూపాక్ష దేవాలయం, రిజర్వాయర్ మరియు డైనింగ్ హాల్ చూడవచ్చు. వలస పాలనలో సైనికులకు శిక్షణ ఇవ్వడానికి బ్రిటిష్ వారు ఈ కోటను ఉపయోగించారని చెబుతారు.

kondareddyfort1

కొండా రెడ్డి కోట

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చారిత్రాత్మక కోట గతాన్ని ఒక్కసారి తెలుసుకోవాల్సిందే. కర్నూలు నగరంలో ఉన్న ఈ కొండా రెడ్డి కోట ఈ పట్టణంలో చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ప్రత్యేకమైన స్మారక చిహ్నం కోట నుండి 52 కి.మీ దూరంలో ఉన్న గద్వాల్‌కు దారితీసే రహస్య భూగర్భ సొరంగం ఉంద‌ని చెబుతారు. ఈ సొరంగం తుంగభద్ర నది దిగువనకు వెళుతుంది. ఇది విజయనగర వాస్తుశిల్పం యొక్క అద్భుతమైన నిర్మాణంగా చెప్పొచ్చు. ఈ కోట అనేక బురుజులను కలిగి ఉంది. 17వ మరియు 18వ శతాబ్దాలలో మూడు స్థాయిలను వాచ్ టవర్‌లుగా ఉపయోగించారు. పెద్ద ఎల్లమ్మ, చిన్న ఎల్లమ్మ అనే రెండు పురాతన దేవాలయాలు కోట లోపల ఉన్నాయి.

chandragirifort1

చంద్రగిరి కోట

యాదవ పాలకులచే 11వ శతాబ్దంలో నిర్మించబడిన చంద్రగిరి కోటలో ఎనిమిది దేవాలయాలు, ఒక రాజ మహల్, ఒక రాణి మహల్ మరియు ఇతర ముఖ్యమైన నిర్మాణాలు ఉన్నాయి. ఈ స్మారక చిహ్నం స్వర్ణముఖి నది ఒడ్డున నెలకొని ఉంది. ఇది విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడినప్పటికీ మొఘల్ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. కోట రెండు భాగాలుగా విభజించబడింది. దిగువ మరియు ఎగువ కోట. ఎగువ కోట ఒక కొండపై ఉంది. అందువల్ల ప్రాకారాలు, వాచ్ టవర్లు మరియు చుట్టుపక్కల భూభాగం యొక్క గంభీరమైన వీక్షణను అందిస్తుంది.

More News

Read more about: vijayanagaram fort gandikota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+