కర్నాటకలోని ఒక్కలిగ సమాజిక వర్గానికి అత్యంత పవిత్రమైన క్షేత్రం ఆదిచుంచనగిరి క్షేత్రం. బెంగళూరు నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్ర సందర్శనం కోసం కర్నాటక వాసులే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ క్షేత్రానికి సంబంధించిన కథనం మీ కోసం....

అది చుంచనగిరి పేరు ఎలా వచ్చింది
P.C: You Tube
చుంచ, కంచ అనే ఇద్దరు రాక్షసులు ఈ క్షేత్రంలోని ప్రజలను తీవ్రంగా హింసించేవారు. వీరిలో చుంచుడనే రాక్షసుడిని పరమశివుడు ఇక్కడే సంహరిస్తాడు. అందువల్లే ఈ ప్రాంతానికి చుంచనగిరి అని పేరు వచ్చింది.

పంచలింగేశ్వర క్షేత్రం
P.C: You Tube
శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవేశ్వరుడు. ఇక ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని పంచలింగ క్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ఐదు లింగాలను స్థాపించారు. ఈ క్షేత్రంలో ప్రధాన దైవం గంగాధరేశ్వరుడు.

శివుడి ఐదు రూపాలు
P.C: You Tube
ఇక్కడ పరమశివుడు ఐదు లింగాల రూపంలో వెళిశాడని చెబుతారు. వారి పేర్లు గంగాధరేశ్వరస్వామి, చంద్రమౌళేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి, సిద్దేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి. అందువల్లే ఈ క్షేత్రాన్ని పంచలింగ క్షేత్రమని పిలుస్తారు.

పవిత్రమైన స్థలాలు
P.C: You Tube
ఈ ఆదిచుంచనగిరి క్షేత్రం చిన్న గుట్ట పైన ఉంది. ఈ గుట్ట పై భాగాన్ని ఆకాశ భైరవ శిఖరం అని అంటారు. ఇక్కడే చిన్న సరోవరం కూడా ఉంది. దీనిని బిందు సరోవరం అని పిలుస్తారు. దీనితో పాటు మరో సరోవరం కూడా ఉంది. ఈ రెండు సరోవరాలను తెప్పోత్సవాల కోసం వినియోగిస్తారు. ఇందులో పాత సరోవరాన్ని ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించారు.

3,300 అడుగుల ఎత్తులో
P.C: You Tube
శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థానం సుమారు 3,300 అడుగుల ఎత్తులో ఉంది. ఎం.ఎస్.ఎల్ బెంగళూరు నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు-మంగళూరు నేషనల్ హైవేలో ఈ మఠం వస్తుంది.

మల్లేశ్వరం సన్నిధానం
P.C: You Tube
అది చుంచనగిరి మఠం ఎక్కినప్పుడు మనకు మొదట మల్లేశ్వరం సన్నిధానం కనిపిస్తుంది. మల్లెలంటే ఇష్టపడే ఇక్కడి ఈశ్వరుడు ఇక్కడ కొలువై ఉండటం వల్ల ఇక్కడి దైవాన్ని మల్లేశ్వరుడని ఈ ప్రాంతాన్ని మల్లేశ్వరం అని పిలుస్తారు. ఇక్కడ పరమేశ్వరుడిని మల్లెల ద్వారా పూజిస్తే అనుకొన్న కోర్కెలన్నీ నెరవేరుతాయని చెబుతారు.

మయూర వనం
P.C: You Tube
ఈ శ్రీ క్షేత్రం సుందరమైన అటవీప్రాంతం మధ్యలో ఉంది. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం కొటొచ్చినట్టు కనబడుతుంది. చుట్టూ శాంతియుత వాతావరణం మధ్యలో మనం ఉండటం మంచి అనుభూతిని మిగులుస్తుంది. ఇక్కడ నాట్యమాడే నెమళ్లు చాలా కనిపిస్తాయి. అందువల్లే దీనిని మయూరవనం అని అంటారు.

ఎలా చేరుకోవాలి
P.C: You Tube
ఇక్కడకు దగ్గర్లో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విమానాశ్రయం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు, మండ్యా, మైసూరు నుంచి ఇక్కడకు రైలు సౌకర్యం ఉంది. బెంగళూరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications













