ఇటీవల దసరా, దీపావళికి ట్రైన్లు, బస్సులు పలు టూర్ ప్యాకేజీలను అతి తక్కువ ధరలకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా ఓ విమాన సంస్థ కూడా దీపావళి పండుగ సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. అతితక్కువ ధరకే ప్రయాణికులు ఫ్లైట్‌లో వెళ్లేలా ప్లాన్ చేసింది. ఈ ఆఫర్లేంటో చూసేద్దామా..?
ఎయిరిండియా స్పెషల్ సేల్స్..
చాలామంది విమానం ఎక్కాలని ఎన్నో కలలుగంటుంటారు. అయితే ఫ్లైట్ టిక్కెట్ల రేట్లు చూసి వెనుకడుగు వేస్తుంటారు. నిజానికి బస్సు, ట్రైన్ టిక్కెట్లతో పోలిస్తే ఫ్లైట్ టిక్కెట్ల ధరలు ఆకాశన్నంటుతాయి. కాబట్టి చాలామంది ప్రయాణికుల కలలు కలలుగానే మిగిలిపోతాయి. అయితే, ఇటీవలీ కాలంలో కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రత్యేక సేల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
ఈ సేల్స్ కింద నిర్దిష్ట సమయంలో, నిర్ణీత ప్రాంతాలకు రెగ్యులర్ కంటే అతి తక్కువ ధరలకే ఫ్లైట్ టికెట్లను ప్రకటిస్తున్నాయి. ఇండిపెండెన్స్ డే, దుర్గాష్టమి, దసరా వంటి పండుగల వేళ స్పెషల్ సేల్స్ తీసుకొచ్చిన ఎయిరిండియా, విస్తారా, ఇండిగో వంటి సంస్థలు. ఇప్పుడు.. దీపావళికి కూడా ఒక్కొక్కటిగా ప్రత్యేక సేల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఎయిరిండియా సంస్థ దీపావళి వేళ రెండు ప్రత్యేక సేల్స్‌ను లాంఛ్ చేసింది.

అక్టోబర్ 27 వరకు..
అందులో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ లైట్, ఎక్స్‌ప్రెస్ వాల్యూ సేల్స్ ఉన్నాయి. ఇక, ఎక్స్‌ప్రెస్ లైట్ కింద అయితే, ప్రయాణికుల కోసం రూ. 1456 తోనే విమాన టికెట్లు ప్రారంభమవుతున్నాయి. మరొక సేల్ ఎక్స్‌ప్రెస్ వాల్యూ కింద రూ. 1606 తోనే ఫ్లైట్ టికెట్ అందుబాటులో ఉన్నాయి.
ఇంత తక్కువ ధరలు కలిగిన విమాన టిక్కెట్లను బుక్‌చేసుకోవాలంటే మాత్రం అక్టోబర్ 22వ తేది నుంచి అక్టోబర్ 27 వ తేది వరకు మాత్రమే ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇవాళ కాక మరో 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ టికెట్లను బుక్ చేసుకున్నవారు నవంబర్ 1 2024, నుంచి డిసెంబర్ 10వ తేది మధ్యలో ప్రయాణాలు చేసేందుకు వీలుంటుంది.
రూ. 1606 నుంచి..
ఎయిరిండియా అందిస్తోన్న ఈ ఫ్లాష్ సేల్ కింద ప్రధాన నగరాల మధ్య తక్కువ ధరల్లోనే టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణం చేయొచ్చు. ఎక్స్‌ప్రెస్ వాల్యూ సేల్‌తో గువాహటి టు అగర్తలా, కొచ్చి టు బెంగళూరు, చెన్నైటు బెంగళూరు, విజయవాడ టు హైదరాబాద్ వంటి సిటీల మధ్య ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇక వీటిల్లో ప్రారంభ ధరలు చూస్తే రూ. 1606 నుంచి ఉన్నాయి. అందుకే లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఎయిరిండియా సంస్థ సూచిస్తోంది.

రూ. 1456 నుంచి..
ఇక, క్స్‌ప్రెస్ లైట్ సేల్ కింద లాగిన్ అయిన మెంబర్స్‌కు రూ. 1456 నుంచి ధరలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ, ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ ఎయిరిండియాఎక్స్‌ప్రెస్.కామ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే మాత్రం జీరో కన్వినియన్స్ ఫీజు పడే అవకాశం ఉంది. వీటితోపాటు రూ. 350 డిస్కౌంట్ కూడా పొందే వెసులుబాటు ఉంది.
అంతేకాదు, అదనంగా ఇంకా 3 కేజీల వరకు క్యాబిన్ బ్యాగేజీని కూడా ఉచితంగానే బుక్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ రూట్లకు డిస్కౌంట్ ధరల్లోనే బ్యాగేజీ బుకింగ్ కూడా అందుబాటులో ఉంది. దేశీయ ఫ్లైట్లలో 15 కేజీల బ్యాగేజీకి రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. అదే 20 కేజీల బ్యాగేజీకయితే రూ. 1300 చెల్లించాలి. ఇందులో ప్రయాణించే లాయల్టీ మెంబర్స్ 50 శాతం డిస్కౌంట్ రుసుముతో బిజినెస్ సీట్లకు అప్‌గ్రేడ్ చేసుకునేందుకు అవకాశం కూడా ఉంది.



Click it and Unblock the Notifications













