Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అక్ష‌ర్‌ధామ్ ఆల‌యం..

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అక్ష‌ర్‌ధామ్ ఆల‌యం..

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అక్ష‌ర్‌ధామ్ ఆల‌యం..

ప్ర‌స్తుతం ఇప్పుడు భారత్‌ G20 సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ 9 నుంచి రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల నుంచి ప్రతినిధులు భారత్‌కు చేరుకున్నారు. అదే క్రమంలో, భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ కూడా బ్రిటన్ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా తన భార్యతో కలిసి భారతదేశానికి చేరుకున్నారు. రెండవ శిఖరాగ్ర సమావేశం ప్రారంభానికి ముందు, అతను తన భార్య అక్షితా మూర్తితో కలిసి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయానికి చేరుకున్నాడు. అక్షరధామ్ ఆలయం దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. రండి, ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.

ఈ ఆల‌యం పేరిట ప్రత్యేక రికార్డు..

ఢిల్లీలోని కామన్వెల్త్ ఖేల్గావ్ సమీపంలో ఉన్న అక్షరధామ్ దేవాలయాన్ని స్వామినారాయణ దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయం 6 నవంబర్ 2005న ప్రారంభించబడింది. ఆ తర్వాత 8 నవంబర్ 2005 నుండి దర్శనం కోసం తెరవబడింది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా పేరుగాంచింది. అంతేకాదు, ఈ ఆలయం అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా పేరు నమోదు చేసుకుంది.

1

ఇవీ ఆలయ ప్రత్యేకతలు..

ఈ దేవాలయం తన అందాలతో ప‌ర్యాట‌కుల మనసులను గెలుచుకుంది. ఇది అందమైన వాస్తుశిల్పానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 10,000 సంవత్సరాల పురాతన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను వర్ణిస్తుంది. విశేషమేమిటంటే ఉక్కు, కాంక్రీటు ఉపయోగించకుండా ఈ ఆలయాన్ని నిర్మించడమే ఈ ఆల‌య మ‌రో విశేష‌త‌. పింక్ ఇసుకరాయి, తెల్లని పాలరాయితో ఈ ఆలయం నిర్మించబడింది.

ఐదేళ్లలో ఆలయ నిర్మాణం..

ఐదేళ్లలో పూర్తి చేసిన ఈ ఆలయాన్ని దాదాపు 11,000 మంది కళాకారులు నిర్మించారు. ఈ ఆలయంలో 234 చెక్కిన స్తంభాలు, 9 గోపురాలు, దాదాపు 20 వేల ఋషులు, దేవతల విగ్రహాలు ఉన్నాయి. 350 అడుగుల పొడవు, 315 అడుగుల వెడల్పు, 141 అడుగుల ఎత్తు ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భ‌క్తులు త‌ర‌లి వస్తుంటారు.

3

ఎప్పుడు సందర్శించవచ్చు?

అక్షరధామ్ ఆలయం ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం దాని అందమైన నిర్మాణంతో పాటు, నీటి ప్రదర్శనకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రస్తుతం ఒక థియేటర్ కూడా ఉంది. ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం నీటి ప్రదర్శన నిర్వహించబడుతుంది. ఈ ప్రదర్శన చాలా ప్రసిద్ధి చెందింది. దీని మొదటి ప్రదర్శన సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది. అయితే, వారాంతాల్లో లేదా ప్రభుత్వ సెలవు దినాల్లో ఒకటి కంటే ఎక్కువ ప్రదర్శనలు నిర్వహించబడవచ్చు. ప్రస్తుతం షో టైమింగ్ 7:15 pm. 12 ఏళ్లు పైబ‌డిన‌వారికి ప్రదర్శన టిక్కెట్ ధ‌ర రూ. 90, సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు 90 రూపాయ‌లు, పిల్ల‌లకు అర‌వై రూపాయ‌లు, నాలుగేళ్ల‌లోపు పిల్ల‌ల‌కు ప్ర‌వేశం ఉచితం.

ఇక్క‌డ ఇవి నిషేదం..

ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు, కొన్ని వ‌స్తువులు నిషేదించ‌బ‌డ్డాయి. అవెంటో చూద్దాం. బొమ్మలు, ఆహార‌పానీయాలు, పొగాకు, డ్ర‌గ్స్‌తో స‌హా అనేక వ్యక్తిగ‌త వ‌స్తువులు, బ్యాగులు, ప‌ర్సులు, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు (మొబైల్, కెమెరా, పెన్‌డ్రైవ్, హ్యాండ్స్-ఫ్రీ మొదలైనవి) వీట‌న్నింటిని క్లోక్ రూమ్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

More News

    Read more about: g20 summit global conference
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+