Search
  • Follow NativePlanet
Share
» »భాగ్య‌న‌గ‌రంలోని ఈ వీధుల్లో అన్నీ ర‌కాల వెరైటీ ఫుడ్స్ ల‌భించును..!

భాగ్య‌న‌గ‌రంలోని ఈ వీధుల్లో అన్నీ ర‌కాల వెరైటీ ఫుడ్స్ ల‌భించును..!

హైద‌రాబాద్, బెంగుళూరు వంటి న‌గ‌రాల్లోని ప్ర‌జ‌లు ఎక్కువ‌గా స్ట్రీట్ ఫుడ్‌కు అల‌వాటుప‌డిపోయారు. ప‌గ‌లంతా బిజి బిజి షెడ్యూల్‌తో, ట్రాఫిక్ అవ‌స్థ‌ల‌తో ఇబ్బందులు ప‌డి చీక‌టి ప‌డే స‌రికి స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో ఇష్ట‌మైన ఫుడ్‌ను లాగించేస్తున్నారు. ఇక భాగ్య‌నగ‌రంలో స్ట్రీట్ ఫుడ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.. ఇక్క‌డ అన్నీ ర‌కాల వైరేటీలు ల‌భించును. రండి..హైద‌రాబాద్‌లో ప్ర‌సిద్ధిచెందిన స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ గురించి తెలుసుకుందాం..

చార్మినార్‌..

భాగ్య‌న‌గ‌రంలో స్ట్రీట్‌ ఫుడ్‌ అనగానే ఫుడ్ ల‌వ‌ర్స్‌కు ముందుగా గుర్తొచ్చే ప్లేస్ చార్మినార్. అర్థ‌రాత్రి అయినా సరే చార్మినార్‌ దగ్గరికి వెళ్తే చాలు ఎలాంటి ఫుడ్ అయినా క్ష‌ణాల్లో ల‌భిస్తుంది. ఇక్క‌డ‌ మొఘల్‌ నుంచి నిజాం కాలం వరకూ ఏ రకం ఫుడ్‌ కావాలన్నా ల‌భిస్తుంది. చార్మినార్‌లోని ఫుడ్ స్టాల్స్‌లో పత్తర్‌ కా ఘోష్‌ చాలా ఫేమస్‌. ఒక్కసారైనా ఈ వంటకాన్ని టేస్ట్‌ చేయాలని చాలామంది భావిస్తుంటారు. ఇంకా ఇక్క‌డి స్టాల్స్‌లో హైదరాబాద్ లో పేరుగాంచిన హలీమ్, కోవా జిలేబీ, కోవా గులాబ్‌జామ్, మాషా అల్లా ఫలూదా, టర్కిష్‌ మరగ్, సీక్‌ కబాబ్, ఫిర్నీ, షావర్మా, షాదూద్‌ మలాయ్, కీమా, భాజీ గుర్డా, ఇరానీ చాయ్‌, హోటల్‌ షాబాద్‌లో నాస్టా, ఖట్టి కిచిడీ వంటి వైరెటీల‌న్నీ దొరుకుతాయి. ఇక ఇక్క‌డి స్టాల్స్ ఉద‌యం నుంచే ఫుడ్ ల‌వ‌ర్స్‌కి అందుబాటులో ఉంటాయి.

hyderabad shopping

ప‌లు స్ట్రీట్‌లు..

ఇలాంటి న‌గ‌రాల్లో చాలా వ‌ర‌కు లేట్‌ నైట్‌ ఫుడ్‌ స్టాళ్లకు అనుమతులు ఇస్తున్నారు. దాంతో నేటి యూత్‌ కూడా వాటికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఎందుకంటే, వీకెండ్స్‌లో నైట్‌ లైఫ్‌ ఎంజాయ్ చేసేవారు ఎక్కువైపోయారు. నలుగురైదుగురు ఫ్రెండ్స్‌ కలిసి బైక్‌లు, కార్లలో రాత్రివేళ్ల షికార్లు చేస్తున్నారు. వారంతా ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్‌కే మ‌క్కువ చూపుతున్నారు. ఇక‌, న‌గ‌రంలో ఎక్కువ‌గా మొజంజాహీ మార్కెట్, రాంకీబండి, సికింద్రాబాద్, లోయర్‌ ట్యాంక్‌బండ్, ఉప్పల్‌ భగా వంటి స్ట్రీట్‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇక్కడ దొరికే స్ట్రీట్‌ ఫుడ్ కోసం ఫుడ్ ల‌వ‌ర్స్ క్యూలు క‌డుతుంటారు.

మాదాపూర్ - హైటెక్‌ సిటీ

న‌గ‌రంలో స్ట్రీట్ ఫుడ్‌కు పేరొందిన ప్ర‌దేశాల్లో మాదాపూర్ , హైటెక్ సిటిలు కూడా చేరాయి. ఈ ప్ర‌దేశాలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల అడ్డా గా చెప్పుకోవాలి. ఎందుకంటే, ఐటీ ఉద్యోగులు హైటెక్‌ సిటీ, మాదాపూర్‌లోనే ప‌నిచేస్తుంటారు. వీరంతా ఇటీవల కాలంలో స్ట్రీట్‌ ఫుడ్‌ కల్చర్ కు ఎక్కువ‌గా అలవాటు ప‌డిపోయారు. ఎందుకంటే, ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం నైట్‌ డ్యూటీలే చేసేవారు ఉంటారు. వీళ్ల‌లో ఇంట్లో వండుకుని తినేవారు చాలా త‌క్కువ‌. ఎక్కువ‌గా స్ట్రీట్ ఫుడ్‌పైనే ఆధార‌ప‌డుతుంటారు. ఆక‌లేసినప్ప‌డు, బోర్ కొట్టిన‌ప్ప‌డు స‌ర‌దాగా కొలిగ్స్ తో క‌లిసి ఫుడ్ స్టాల్స్‌కు వెళ్తుంటారు.

streets of Hyderabad

నెక్లెస్‌ రోడ్‌..

ఫుడ్‌స్టాల్స్‌కు ప్ర‌సిద్ధిచెందిన మ‌రో ప్రాంతం నెక్లెస్‌ రోడ్డు. ఇక్క‌డ దొర‌క‌ని ఫుడ్ అంటూ లేదు. వెనీలా, చాక్లెట్‌ కప్‌ కేక్స్, మల్బరీ, స్ట్రాబెర్రీ చాక్లెట్, పానీపూరీ, చాట్, బ్రెడ్‌ ఉడకబెట్టిన మొక్కజొన్న, ట్విస్టెడ్‌ పొటాటో, వెజ్, చికెన్, ఫ్రైడ్‌ మోమూస్, స్టీమ్‌ మోమూస్, చైనీస్‌ ఫుడ్‌ ఇలా ఒక్కటేంటి... అన్నీరకాల వెరైటీలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కుబూస్, రుమాలీ షావర్మా, చాట్, పానీపూరీస్మైలీ, ఎగ్‌ దోశ, ఎగ్‌ ఆమ్లెట్‌ షావర్మా, చికెన్‌ కబాబ్స్, క్రిస్పీ స్పైసీ చికెన్, సమోలీ వంటివి స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే ల‌భిస్తాయి. వైరెటీ ఫుడ్‌తో పాటు చిన్న పిల్లలు, పెద్దలు ఆడుకునేందుకు అనేక రకాలా ఆటవస్తువులు కూడా ఇక్క‌డ ఉంటాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+