Search
  • Follow NativePlanet
Share
» »ఈఆలయంలో ఆకాశం ఎత్తు పెరిగిపోతున్న శివలింగాన్ని గోటితో గిల్లి పెరగకుండా చేసిన దేవేంద్రుడు

ఈఆలయంలో ఆకాశం ఎత్తు పెరిగిపోతున్న శివలింగాన్ని గోటితో గిల్లి పెరగకుండా చేసిన దేవేంద్రుడు

పంచారామాల్లో ప్రథమ క్షేత్రం అమరలింగేశ్వర క్షేత్రం. బాలచాముండికా సమేతా అమరలింగేశ్వరుడు ఇక్కడ ప్రధానదైదవం. తారకాసుర సంహార సమయంలో కుమారస్వామి మెడలోని శివలిగాన్ని తారకాసురుడు బలంగా కొట్టడంతో

పంచారామాల్లో ప్రథమ క్షేత్రం అమరలింగేశ్వర క్షేత్రం. బాలచాముండికా సమేతా అమరలింగేశ్వరుడు ఇక్కడ ప్రధానదైదవం. తారకాసుర సంహార సమయంలో కుమారస్వామి మెడలోని శివలిగాన్ని తారకాసురుడు బలంగా కొట్టడంతో అది ఐదు ముక్కలుగా విడిపోయిన ఐదు ప్రదేశాల్లో పడి దివ్వమైన పుణ్యక్షేత్రాలుగా మారాయని పురాణాలు చెప్తున్నాయి. ఆ ఐదు క్షేత్రాలే పంచారామాలు. అలా వాటిలో ఒకటి అమరావతిలో పడింది. అప్పటి నుండి అమరలింగేశ్వరుడుగా పూజలందుకుంటున్న శైవక్షేత్రంగానే కాకుండా బౌద్ధ మతపరంగానూ అమరావతి ప్రఖ్యాతీ చెందినది.

అమరేశ్వర ఆలయం ఆ పరమేశ్వరుడికి అంకితం చేయబడినది. దేవేరి రాజ్యలక్ష్మీ అమ్మవారు కూడా కొలువుదీరారు, పంచప్రాకారాలు మధ్య ఆలయం ఎత్తుగా నిర్మించబడినది. ఈ ఆలయంలో శివలింగం ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ శివలింగం సుమారు 15 అడుగుల ఎత్తు ఉంది. 3 అడుగులకై వారంతో తెల్లగా ఉంటుంది. అభిషేకాదులు రెండవ అంతస్తులో చేస్తారు. ఆలయంలో మూడు ప్రాకారాలు, నాలుగు దిక్కుల నాలుగు ధ్వజ స్థంభములు దక్షిణ ద్వారంలో ముఖ మండపం, తూర్పు ద్వారమునకు ఎదుగా కృష్ణానది ఉంది.

మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్ధివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోలలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపుర సుందరీదేవి ఆలయాలు, కల్యాణ మండపం, కృష్ణానదికి తోవ ఉన్నాయి. రెండో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు, నవగ్రహ మంటపం, యజ్ఞశాలలు ఉన్నాయి. మూడోప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు సూర్యుడి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో శివలింగం అంత ఎత్తులో పెరగడానికి ఒక పురాణా గాథ గురించి వివరంగా తెలుసుకుందాం...

మందగిరిని వాసుకి

మందగిరిని వాసుకి

మందగిరిని వాసుకి సర్పంతో సముద్ర మధనం చేసిన తర్వాత అమృతం వచ్చింది కదా! అప్పుడు విష్ణుమూర్తి మోహినీ రూపం ధరించి అమృతం భాండాన్ని చేపట్టి దేవతలకు, రాక్షసులకు పంచసాగాడు. అప్పడు అమృతం దేవతలకు, రాక్షసులకు సమానంగా పంచడం లేదని తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రాక్షసులు ఆందోళనలు చేశారు.

 త్రిపురాసురులు, నాధుల నేతృత్వంలో తపస్సు

త్రిపురాసురులు, నాధుల నేతృత్వంలో తపస్సు

త్రిపురాసురులు, నాధుల నేతృత్వంలో తపస్సు చేశారు. బోళాశంకరుడు వారి తపస్సుకు ముగ్ధుడై వరాలు ప్రసాదించాడు. దాంతో ఆ వరాలందుకున్న రాక్షుల్లో ఉత్తేజం మరింత పెరిగింది. దాంతో దేవతలను మరింత ఎక్కువగా హింసించసాగారు.

దేవతలు శివుడికి మెరపెట్టుకోవడంతో

దేవతలు శివుడికి మెరపెట్టుకోవడంతో

దేవతలు శివుడికి మెరపెట్టుకోవడంతో , భోళాశంకరుడికి ఆనందంవచ్చినా, ఆగ్రహం వచ్చినా పట్టలేడు కదా! శివుడు కాలరుద్రుడై రాక్షసులను వారి రాజ్యాన్ని క్షణంలో బూడిద చేసి త్రిపురాంతకుడు అయ్యాడు. ఆ సమయంలో త్రిపురాసురుడు మింగిన పెద్ద లింగం ఐదు ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడటం వల్ల ఆ ఐదు ప్రదేశాలు పంచారామాలుగా విలసిల్లుతున్నాయి.

అమరావతిలో పడిన శివలింగం భాగము

అమరావతిలో పడిన శివలింగం భాగము

అమరావతిలో పడిన శివలింగం భాగము ఆకాశాన్ని తాకుతుందేమో అన్నట్టు పెరగసాగింది. అది చూసిన దేవేంద్రడు శివలింగపై తన గోరుతో పొడిచాడు.దాంతో శివలింగం పెరగడం ఆగిపోయింద. అయితే ఇంద్రుని గోరు గుచ్చుకుని శివలింగానికి రక్తం కారింది. ఆ రక్తపు చారల చిహ్నంగా ఇప్పటికీ అమరావతి క్షేత్రంలోని అమరలింగేశ్వర ఆలయంలోని శివలింగానికి గుర్తులు కనబడుతాయి.

ఈ క్షేత్రములో శివుడు ప్రణవేశ్వరుడనీ,

ఈ క్షేత్రములో శివుడు ప్రణవేశ్వరుడనీ,

ఈ క్షేత్రములో శివుడు ప్రణవేశ్వరుడనీ, అగస్తేశ్వరుడనీ, కోసలేశ్వరుడనీ, సోమ్యేశ్వరుడనీ, పార్థివేశ్వరుడనే పేర్లతో పంచలింగాకారుడై పూజింపబడుచున్నాడు. ఏ భక్తుడైనా ఈ పుణ్యక్షేత్రములో మూడు రోజులు నివసించి కృష్ణాతీర్థములో స్నానమాచరించి అమరేశ్వరుని కొల్చినవారు మరణానంతరము శివసాయుజ్యము పొందుదురు.

శాతవాహనుల కాలంలో అమరావతీ క్షేత్రాన్ని

శాతవాహనుల కాలంలో అమరావతీ క్షేత్రాన్ని

శాతవాహనుల కాలంలో అమరావతీ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. అప్పట్లో అమరావతి వారి రాజధాని. ఈ నగరాన్ని ధరణి కోట లేదా ధాన్యకటం అని పిలిచేవారు. ఈ పవిత్ర దేవాలయంలో అపురూపంగా మలచిన అనేక విగ్రహాలున్నాయి. అమరావతి దత్త క్షేత్రం కూడా. .

అమరలింగేశ్వరుడిని

అమరలింగేశ్వరుడిని

అమరలింగేశ్వరుడిని దర్శించడానికి భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి, పునీతమై అమరేశ్వరుని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో పై అంతస్తులో అభిషేకం చేస్తారు. అమరేశ్వర లింగం ఎంతో ఎత్తుగా ఉండటానికి కింద నుండి అభిషేకం చేయడం వీలుపడదు.

బాల చాముండేశ్వరిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు

బాల చాముండేశ్వరిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు

ఇక్కడి బాల చాముండేశ్వరిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. కృష్ణానది ఒడ్డునే ఉన్న అమరేశ్వరాలయం దగ్గర 105కి.మీ పొడవుతో పుష్కరఘాట్ ఉంది. ఇక్కడి సాయిమందిరం, ధ్యానబుద్ద మందిరం, అమరావతి పురావస్తు ప్రదర్శనశాల, స్తూపం ఇతర దర్శనీయ స్థలాలున్నాయి

ఎలా వెళ్లాలి:

ఎలా వెళ్లాలి:

గుంటూరు జిల్లాల్లో పుష్కర ప్రాధాన్యం ఉన్న స్థలాల్లో అమరావతిదే మొదటి స్థానం. ఇక్కడికి గుంటూరు నుండి ప్రతి 15నిముషాలకు, విజయవాడ నుండి 20 నిముషాలకు ఓ బస్సు ఉంటుంది. గుంటూరు నుండి 40 కి.మీ.ల దూరంలో కలదు. గుంటూరు, విజయవాడ, మంగళగిరిల ద్వారా కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+