Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్రప్ర‌దేశ్‌లోని అబ్బుర‌ప‌రిచే అంద‌మైన జ‌ల‌పాతాలు..

ఆంధ్రప్ర‌దేశ్‌లోని అబ్బుర‌ప‌రిచే అంద‌మైన జ‌ల‌పాతాలు..

ఆంధ్రప్ర‌దేశ్‌లోని అబ్బుర‌ప‌రిచే అంద‌మైన జ‌ల‌పాతాలు..

భారతదేశం పర్వతాలు, సరస్సులు, లోయలు, నదులు మరియు జలపాతాల వంటి అందమైన ప్రకృతి సహజ వనరులకు నెలవు. ఇక్క‌డి అనేక హిల్ స్టేషన్లలకు ఈ జలపాతాలే ప్రధాన ఆకర్షణ. సహజ సౌందర్యం, సంప్రదాయం మరియు సంస్కృతితో సమృద్ధిగా ఉన్న భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈ ప్రాంతంలో ప్రశాంతమైన బీచ్‌లు, పచ్చని అడవులు మరియు జలపాతాలు అనునిత్యం మ‌న‌కు తార‌స‌ప‌డ‌తాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని జలపాతాలు ప్రధానంగా కృష్ణా, గోదావరి మరియు వాటి ఉపనదుల నుండి ఏర్పడతాయి. రాబోయే వ‌ర్ష‌కాలంలో ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు ప్లాన్ చేస్తుంటే మాత్రం మీ యాత్రను విజయవంతం చేసుకోవ‌డానికి ఈ ప్రాంతంలోని ఉత్తమమైన జలపాతాలను సంద‌ర్శించండి.

1

తలకోన జలపాతం, తిరుపతి

చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటుంది. తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ జ‌ల‌పాతం తిరుప‌తికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జ‌ల‌పాతం శేషాచల కొండల పర్వతశ్రేణుల మధ్యలో ఉంది. ఇక్కడ 60 మీటర్ల ఎత్తు నుండి పడుతున్న జలపాతాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తున్నాయి. ఔషధీ లక్షణాలు కల మొక్కలు ఇక్క‌డ అనేకం ఉన్నాయి. అందుకే ఇక్క‌డి నీటికి వైద్యం చేసే శ‌క్తి ఉంద‌ని ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల న‌మ్మ‌కం. తిరుప‌తిని సంద‌ర్శించేందుకు ఎక్క‌డెక్క‌డి నుంచో ప‌ర్యాటకులు త‌ర‌లివ‌స్తుంటారు. ఆ విధంగా ఈ జ‌ల‌పాతం కూడా ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందింది.

2

కటిక జలపాతం, విశాఖ‌ప‌ట్నం

కటికి జలపాతం, విశాఖపట్నం సమీపంలోని ఒక పర్యాటక ప్రదేశం. ఈ జలపాతం సుమారు 50 అడుగుల ఎత్తుంటుంది. బొర్రా గుహల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది గోస్తనీ నది నంచి ప్రారంభమవుతుంది. ఈ జ‌ల‌పాత‌పు నీరు ఎంతో పార‌ద‌ర్శ‌కంగా క‌నిపిస్తాయి. ఇక్క‌డి ప‌చ్చ‌ద‌నం ప‌ర్యాట‌కుల‌ను రా రమ్మంటూ ఆహ్వం ప‌లుకుతుంటుంది. బొర్రా గుహలు, అరకు నుండి సుమారు ఏడు కిలోమీట‌ర్ల దూరంలో ఉంటాయి. ట్రెక్కింగ్ ప్రియుల‌కు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది. అలాగే, కాలిన‌డ‌క‌న వెళ్లేవారు ఇక్క‌డి స‌హ‌జ అందాల‌కు మంత్ర‌ముగ్ధుల‌వ్వాల్సిందే. చుట్టూ ఉండే ప‌చ్చ‌ద‌నంతో స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూ కాలిన‌డ‌క‌న బ‌య‌లుదేరొచ్చు.

రంప జలపాతం, తూర్పుగోదావరి

తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రంప జలపాతం ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ జ‌ల‌పాతాన్ని చేరుకోవాలంటే కేవలం 20 నిమిషాలు ట్రెక్కింగ్ చేస్తే స‌రిపోతుంది. ఇది మండల కేంద్రమైన రంపచోడవరం నుండి 10 కిలోమీట‌ర్ల‌ దూరం లోను, సమీప పట్టణమైన రాజమండ్రి నుండి 58 కిలోమీట‌ర్ల‌ దూరంలోనూ ఉంది. ద‌ట్ట‌మైన అడ‌వి మ‌ధ్య ఉండే ఈ జ‌ల‌పాతంలో స్నానం చేయ‌డం ఎంతో థ్రిల్లింగ్‌గా, రిప్రెష్‌గానూ ఉంటుంది. ఈ జ‌ల‌పాతంలో ఏడాది పొడ‌వునా నీరు ఉంటుంది.

3

నాగలాపురం జలపాతాలు, చిత్తూరు

నాగలాపురం జ‌ల‌పాతం చిత్తూరు జిల్లాలో ఉంది. ఇది కేవ‌లం తిరుప‌తికి 70 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుది. నాగలాపురం హిల్ స్టేషన్‌లో ఉన్న ఈ జలపాతాన్ని 'క్వీన్ ఆఫ్ వాటర్ ఫాల్స్' అని పిలుస్తారు. పచ్చని ప్రకృతి అందాలను, జలపాతాన్ని చూడటానికే ఎక్కువ మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వ‌స్తుంటారు. 'నాగాల ట్రెక్' తూర్పు కనుమలలో ఎంతో ప్రాచుర్యం పొందిన ట్రెక్‌. ఈ జలపాతం వెంబడి ట్రెక్, అద్భుత అనుభూతిని ఇస్తుంది. చుట్టూ కొండలు, అడవులు, నదుల మధ్య గలగల పారే సెల‌యేళ్లు కిందకు దూకుతూ ఉంటుంది. ఇది ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌ను మ‌రో ప్ర‌పంచంలోకి తీసుకెళ్తుంది.

More News

    Read more about: talakona falls andhra pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+