Search
  • Follow NativePlanet
Share
» » Amrit Udyan: అమృత్ ఉద్యాన్ సంద‌ర్శ‌న‌లో ఈ విష‌యాలు తెలుసుకోండి...

Amrit Udyan: అమృత్ ఉద్యాన్ సంద‌ర్శ‌న‌లో ఈ విష‌యాలు తెలుసుకోండి...

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఉన్న అమృత్ ఉద్యాన్ నేటి నుండి అంటే ఫిబ్రవరి 2 నుండి సాధారణ ప్రజల కోసం తెరవబడుతుంది. ఇక్కడ అనేక రకాల గులాబీలు, తులిప్స్, ఔషధ చెట్లు మరియు మొక్కలను వీక్షించొచ్చు..ఈ ఉద్యాన‌వ‌నాన్ని చూసేందుకు విదేశాల నుంచి కూడా ప‌ర్యాట‌కులు త‌ర‌లి వ‌స్తుంటారు. విదేశాల నుంచి కూడా సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ అమృత్ ఉద్యానాన్ని సందర్శిస్తున్నప్పుడు, వేరే ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది.

ఇక్కడ అందం అలాంటిది. రంగురంగుల పువ్వులను చూడటం వల్ల సంతోషంతోపాటు మనసుకు ఉల్లాసం కూడా కలుగుతుంది. అమృత్ ఉద్యాన్‌ను గ‌తంలో మొఘల్ గార్డెన్ అని పిలిచేవారు. ఇక్కడకు రావడం ద్వారా ప‌ర్యాట‌కులు అనేక రకాల గులాబీలు, తులిప్‌లను చూడొచ్చు. వాటిని మీమీ కెమెరాల్లో బంధించొచ్చు. ఈ గార్డెన్ ఫిబ్ర‌వ‌రి 2 నుంచి మార్చి 31 వ‌ర‌కు సంద‌ర్శ‌కుల కోసం తెర‌వ‌బ‌డుతుంది. అమృత్ ఉద్యానవ‌నం చ‌రిత్ర గురించి ఇప్ప‌డు తెలుసుకుందాం.

amritudyan

అమృత్ ఉద్యాన్‌ చరిత్ర..

1911లో బ్రిటిష్ వారు తమ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు. వైస్రాయ్ నివాసం కోసం ఢిల్లీలోని రైసినా కొండలను కత్తిరించి వైస్రాయ్ హౌస్ నిర్మించడం జ‌రిగింది. ప్రస్తుతం దీనిని రాష్ట్రపతి భవన్ అని కూడా పిలుస్తారు. సర్ లుటియన్స్ 1917లో వైస్రాయ్ హౌస్‌లో అమృత్ ఉద్యాన్‌ను రూపొందించారు.1928-29 సంవత్సరంలో ఇక్కడ తోటపని పనులు ప్రారంభించ‌డం జ‌రిగింది. ఈ ఉద్యానవనం మొఘల్‌ పాలకులకు ప్రకృతిపై ఉన్న ప్రేమకు ప్రత్యక్ష సాక్షాలుగా నిలుస్తున్నాయి.

ఇవి పెర్షియన్‌ శైలిలో నిర్మించిన తోటలు. ఈ రకపు తోటలు పెర్షియా తోటల చార్‌బాగ్‌ నిర్మాణంలో కట్టినవి. ఈ గార్డెన్స్‌లో సరస్సులు, ఫౌంటేన్లు, కాలువలు కూడా ఉన్నాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో ఎన్నో మొఘల్‌ గార్డెన్స్‌ను నిర్మించారు. షాలిమర్‌ గార్డెన్స్‌(లాహోర్‌), ఢాకాలోని లాల్‌ బాగ్‌ కోట, శ్రీనగర్‌లోని షాలిమర్‌ గార్డెన్స్, మొఘల్‌ గార్డెన్స్‌లో ఉన్నాయి. తాజ్‌ మహల్‌ వద్ద కూడా మొఘల్‌ గార్డెన్స్‌ ఉంది.

amritudyan, travel guide

మొఘల్ గార్డెన్‌కి ఆ పేరు ఎలా వచ్చింది?

మొఘలుల పాలనలో భారతదేశంలో అనేక తోటలు నిర్మించబడ్డాయి. సర్ ఎడ్వర్డ్ లుటియన్స్ ఈ తోటను బ్రిటిష్ మరియు ఇస్లామిక్ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా నిర్మించారు. దీని రూపకల్పన తాజ్ మహల్ తోటలు, జమ్మూ మరియు కాశ్మీర్ తోటలు అలాగే భారతదేశం మరియు పర్షియా యొక్క ఉద్యానవనాల నుండి ప్రేరణ పొందింది. ఇది పూర్తయిన తర్వాత దీనికి మొఘల్ గార్డెన్ అని పేరును పెట్ట‌డం కూడా జ‌రిగింది.

వివిధ రకాల పువ్వులు

అమృత్ ఉద్యాన్‌లో అనేక రకాల పూలను ప‌ర్యాట‌కులు ప్ర‌త్య‌క్షంగా చూడొచ్చు. దాదాపు 138 రకాల గులాబీలు ఇక్కడ ఉన్నాయి. అంతే కాకుండా, 10,000 కంటే ఎక్కువ తులిప్స్ 70 కంటే ఎక్కువ కాలానుగుణ పువ్వులు ఉన్నాయి. అమృత్ ఉద్యాన్‌ను సందర్శించడానికి భారతదేశం నుండి మాత్రమే కాకుండా దేశ విదేశాల నుండి పర్యాటకులు త‌ర‌లి వస్తుంటారు. ఈ తోట చాలా అందంగా ఉంటుంది. సర్ లుటియన్స్ భార్య ఈ తోటను 'స్వర్గం'గా అభివర్ణించింది.

More News

Read more about: amrit garden delhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+