Search
  • Follow NativePlanet
Share
» »ఈ కథనంలో అక్షరాల కంటే బొమ్మలే మీతో మాట్లాడుతాయి

ఈ కథనంలో అక్షరాల కంటే బొమ్మలే మీతో మాట్లాడుతాయి

కర్నాటకలోని అమృతేశ్వర దేవాలయానికి సంబంధించిన కథనం.

భారత దేశానికి ఒక ఆధ్యాత్మిక దేశమన్న ఖ్యాతి ఉంది. ఇక్కడ ఉన్నన్ని దేవాలయాలు మరెక్కా మనకు కనిపించవు. అందువల్లే భారత దేశంలోని ప్రజల జీవన విధానంలో ఆలయాల సందర్శన ఒక భాగంగా మారింది. ఇక ఈ ఆలయల్లో కొన్ని నిఘూడ రహస్యాలకు వేదికలు కాగా, మరికొన్ని అద్భుత శిల్ప సంపదకు నిలయంగా మారాయి.

అటువంటి కోవకు చెందినదే కర్నాటకలోని అమృతేశ్వర దేవాలయం. అంతగా ప్రాచూర్యానికి నోచుకోని ఈ దేవాలయంలోని అద్భుత శిల్పాలు అందాలను నేరుగా చూడాల్సిందే కాని వర్ణించడానికి అక్షరాలు చాలవంటే అతిశయోక్తి కాదేమో. ఈ నేపథ్యంలో ఆలయాలనికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అద్భుత మైన శిల్ప సౌదర్యం ఫొటోల రూపంలో మీ కోసం...

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

P.C: You Tube

కర్నాటకలో ఉన్న అద్భుత దేవాలయాల్లో అమృతేశ్వర దేవాలయం ఒకటి. ఈ దేవాలయం చిక్కమగళూరు జిల్లాలోని అమృతపురమనే చిన్న గ్రామంలో ఉంది.

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

P.C: You Tube

ఆ గ్రామానికి అమృతేశ్వర దేవాలయం వల్లే అమృతపురమని పేరు వచ్చినట్లు చెబుతారు. అద్భుతమైన శిల్పసౌదర్యంలో విరాజిల్లుతున్న ఈ దేవాలయాన్ని హొయ్సళ రాజ వంశానికి చెందిన 2వ వీర భళ్లాల నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ ఆలయం నిర్మాణంలో హోయ్సళ శైలి శిల్ప సౌదర్యం కనిపిస్తుంది. విశాలమైన మంటపం ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ. ఇక ఈ దేవాలయంలో సహజమైన ప్రహరీ గోడ ఉంటుంది.

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

P.C: You Tube

గుండ్రటి ఆకారంలో ఉన్న ఈ ప్రహరీ గోడ చాలా అందంగా కనబడుతుంది. అదే విధంగా ఇక్కడ ఉన్నటు వంటి ఓ మంటపం ముఖ మంటపాన్ని గర్భగుడిని కలిపేదిగా ఉంటుంది.

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ విధానం మనం హొయ్సళ శిల్ప శైలిలో మాత్రమే గమనించగలం. ఈ దేవాలయ నిర్మాణం మొత్తం వీర నారాయణ దేవాలయాన్ని పోలి ఉంటుంది.

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

P.C: You Tube

సుమారు 29 అడుగుల పొడవు, 9 అడుగుల వెడప్పు ఉన్న మంటపం నుంచి గర్భాలయంలోకి వెళ్లవచ్చు. గర్భాలయం చతురస్రాకారంలో మనకు కనిపిస్తుంది.

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

P.C: You Tube

గర్భాలయం గోపురం పై కీర్తి ముఖాలు భారతీయ శిల్ప సౌదర్యానికి అద్దం పడుతాయి. ఈ దేవాలయంలో మూసివేసిన మంటపాన్ని గర్భగుడిని కలిసే మరో చిన్న మంటపం ఉంది.

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

P.C: You Tube

దీని పై హోయ్సళ సామ్రాజ్య చిహ్నమైన సింహం చెక్కబడి ఉంది. ఆలయం గర్భగుడి పై భాగంలో చెక్కిన పద్మపు ఆకారపు అప్పటి శిల్పుల పనికి ప్రత్యక్ష నిదర్శనం.

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

P.C: You Tube

దాదాపు వెయ్యి రేకులతో ఉన్న ఈ పద్మం చూడటానికే పర్యాటకులు ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. దేవాలయ గోడల పై రామాయణ కాలానికి చెందిన ఎన్నో శిల్పాలను మనం

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

P.C: You Tube

అదేవిధంగా కన్నడ భాషతో పాటు దక్షిణ భారత దేశానికి చెందిన తెలుగు, కొంకిణి భాషలో ఉన్న కొన్ని శాసనాలు కూడా మనకు ఇక్కడ మనకు కనిపిస్తాయి.

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

P.C: You Tube

ఇక్కడకు దగ్గరగా బాబా బుడేన్ గిరి, అయ్యనకెరె, కోదండరామ దేవాలయం మాణిక్యాధార జలపాతం తదితరాలు ఉన్నాయి.

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం

P.C: You Tube

బెంగళూరు నుంచి చిక్కమగళూరుకు వెళ్లి అక్కడి నుంచి అమృతపురలోని అమృతేశ్వర దేవాలయం చేరగానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. బస్సు, రైలు సదుపాయాలు ఉన్నాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+