Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మంగుళూరు

మంగుళూరు - కర్నాటక రాష్ట్ర ముఖ ద్వారం

57

మంగుళూరు పట్టణాన్ని కర్నాటక రాష్ట్ర ముఖద్వారంగా చెపుతారు. ఎంతో సుందరమైన నగరం. ఒక పక్క అరేబియా మహాసముద్రం మరోపక్క పశ్చిమ కనుమలు ఈ నగరానికి ఎంతో వన్నె తెచ్చాయి. నగరాన్ని దేవీమాత మంగళాదేవి పేరుపై మంగుళూరు అని నామకరణం చేశారు. మంగుళూరు ఓడరేవు ఎపుడు చూసినా వివిధ ఎగుమతులు, దిగుమతులతో ఎంతో బిజీ ప్రదేశంగా ఉంటుంది.    చరిత్రలో ఈ ఓడరేవు నగరం గురించి 14 వ శతాబ్దపు నిర్మాణంగా అక్కడి స్ధానిక పాలకులు పర్షియన్ గల్ఫ్ దేశాలతో వ్యాపారాలకుగాను చేయబడినట్లు తెలుపుతోంది. మంగుళూరు ప్రాంతం ప్రధాన నగరం కావటంతో పాలనలలో అనేక చేతులు మారింది. పోర్చుగీసు వారు, బ్రిటీష్ వారు, మైసూర్ పాలకులు హైదర్ ఆలి, టిపు సుల్తాన్ లు ఈ నగరం కొరకు గొప్ప యుద్ధాలు చేశారు.

ఎంతోమంది పాలకులు సుందరమైన ఈ నగరం కొరకు పోరాడారు. నేడు ఈ మంగుళూరు నగరం వివిధ సంస్కృతుల నగరంగా విరాజిల్లుతోంది. అంతేకాక ఈ నగరం నేటికి దేశంలోని ప్రధాన ఓడరేవులలో ఒకటిగా భారత దేశ కాఫీ, జీడిపప్పు, ఇతర వాణిజ్య పంటలను ఎగుమతులు చేస్తోంది.  

ప్రకృతి ఆస్వాదకులకు ఒక స్వర్గం    మంగుళూరు నగర సహజ అందాలు ఆ నగరానికి ఎంతో శోభనిస్తాయి. 132.45 చ.కి.మీ.ల ఈ నగరం రెండు నదుల మధ్య విస్తరించింది అది నేత్రావతి మరియు గురుపుర. అరేబియా సముద్ర తీరంలోని చక్కటి బీచ్ లు తాటి చెట్లు మరింత అందాన్ని తెచ్చాయి. ఈ సుందర నగరం పచ్చటి కొండలు, ఎర్రటి పెంకుల ఉపరిభాగం కల ఇండ్లు కలిగి సుమారుగా 6 లక్షలమంది ప్రజలకు నివాసంగా ఉంది.

మంగుళూరు ప్రజల సంస్కృతి సంప్రదాయాలు -మంగుళూరు నగరం వివిధ మతాల ప్రజలకు, భాషలకు నిలయం. ఇక్కడ నాలుగు భాషలు అంటే తుళు, కొంకణి, బియరీ, కన్నడ భాషలు మాట్లాడతారు. ఈ కారణంగా నగరం ఒక మంచి సాంప్రదాయ, సాంస్కృతికతలకు నిలయంగా మారింది. వీరి సాంప్రదాయక యక్షగానం, క్రిష్ణ జన్మాష్టమి, కరదాయ్ వేష డ్యాన్స్ మొదలైవి దేశం యావత్తూ ఆకర్షణలే. వాస్తవానికి మంగుళూరులోని దసరా పండుగ వేడుకలు రాచరిక హంగులకు అద్దంపడుతూ దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తాయి.

చేసేందుకు, చూసేందుకు ఎంతో....మంగుళూరులో చూడవలసిన సహజ అందాలు, వారసత్వ కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఉన్న మంగళా దేవి దేవాలయం దేశ వ్యాప్తంగా వేలాది ప్రజలు దర్శిస్తారు. ఎన్నో పురాతన దేవాలయాలు, భవనాలు ఉన్నాయి. కద్రి మంజునాధ దేవాలయం, సెయింట్ అలోషియస్ ఛాపెల్, రొసారియో కేధడ్రల్, జామా మసీదు వంటివి ఎన్నో చూడదగిన ప్రదేశాలు. చక్కటి ఎండ, ఇసుక తిన్నెలు ఇష్టపడే వారికి సోమేశ్వర, తన్నీర్ బావి బీచ్ లు అనుకూలం.  మంగుళూరు ప్రదేశం ఎన్నో శతాబ్దాలనుండి వేలాది పర్యాటకులను ఆకర్షిస్తోంది. నేటికి ఒక సుందర నగరంగా భాసిల్లుతోంది.

మంగుళూరు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మంగుళూరు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మంగుళూరు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మంగుళూరు

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం జాతీయ రహదారి నెం.13,18,48 ల ద్వారా మంగుళూరు చేరవచ్చు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను మంగుళూరు నుండి వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. దక్షిణ కన్నడ బస్ ఆపరేటర్ల అసోసియేషన్ కూడా బస్సులను నడుపుతోంది. తెలుపు బోర్డు టాక్సీలు, ఆటో రిక్షాలు కూడా స్ధానిక ప్రయాణంగా ఉపయోగించవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం బెంగుళూరు, చెన్నై, ముంబై, హాసన్ మరియు దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో బ్రాడ్ మరియు మీటర్ గేజ్ లలో మంగుళూరు సెంట్రల్ మరియు మంగుళూరు జంక్షన్ లు కలుపబడ్డాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలిగి దేశంలోని వివిధ ప్రాంతాలకు,ప్రపంచంలోని వివిధ ప్రదేశాలకు అందుబాటులో ఉంది. బాజ్ పె లో కల ఈ విమానాశ్రయం నగరానికి ఈశాన్యంగా 10 కి.మీ.ల దూరంలో ఉంటుంది. స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ ఇండియా విమానాలు మంగుళూరు నుండి ప్రయాణిస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed