సోమేశ్వర్ బీచ్, మంగుళూరుకు దక్షిణాన 18 కి.మీ. దూరంలో ఉంది. ఇసుక తిన్నెలు, ఈత చెట్లుతో శోభాయమానంగా ఉంటుంది. ఈ బీచ్ లో ‘రుద్ర శిల ’ అనే పెద్ద రాయి ఉంది. అబక్కదేవి పాలనలో ఒక మందిరం నిర్మించారు. బీచ్ లో నిలబడితే, అరేబియన్ సముద్రం చక్కగా కనపడుతుంది. ఈ ప్రదేశం సోమేశ్వర బస్ స్టాండ్ నుండి చేరవచ్చు. మందిరం నుండి అర్ధ కిలోమీటర్ దూరంలో బస్ స్టాండ్ ఉంటుంది. ఈ ప్రదేశం కోట మరియు రాజ భవన అవశేషాలు కలిగి ఉంటుంది. ఈ బీచ్ లో 100 అడుగుల లైట్ టవర్ ఉంటుంది. పైకి చేరితే, అరేబియన్ సముద్రం బాగా కనపడుతుంది. మంగుళూరు సిటీ నుండి షుమారు 11 కిమీ. దక్షిణదిశగా ఉన్న ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండి చక్కటి ఆహ్లాదాన్నిస్తుంది. ఈ ప్రదేశాన్ని అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అనుకూలంగా చూడవచ్చు. బీచ్ లో సూర్యాస్తమయం ఎంతో బాగుంటుంది. పర్యాటకులకు ఈ ప్రదేశం ఎంతో ఆనందాన్నిస్తుంది. అయితే ప్రభుత్వం నేటికి దీనిని పర్యాటక స్ధలంగా గుర్తించలేదు. జాతీయ రహదారి 66 పై ఉన్న బైందూర్ నుండి బీచ్ మరియు దేవాలయాలకు చేరవచ్చు.