Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాచీన గణపతి ఆలయాలు !!

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాచీన గణపతి ఆలయాలు !!

By Mohammad

పూర్వం వృత్రసురున్ని సంహరించేందుకు దేవతల రాజు ఇంద్రుడు, క్షీరసాగరమధనం సమయంలో దేవదానవులు, గంగమ్మతల్లిని భూమికి తెచ్చేటప్పుడు భగీరధుడు, సీతను అన్వేషించే సమయంలో శ్రీరాముడు ఇలా ఎందరో వినాయక వ్రతం చేసి విజయం సాధించినవారే. కోరుకున్న వరాలను తీర్చేవాడు కనుకనే గణపతి వరసిద్ధి వినాయకుడయ్యాడు. దేవూళ్ళందరిలోనూ విలక్షణ రూపం ఎవరిదైనా ఉందంటే ఆది వినాయకుడిదే. ఆసియాఖండంలోని అనేక ప్రదేశాల్లో గణపతి ఆరాధన ఉంది. మనస్సుపెట్టి ప్రార్ధించాలె కానీ, కోరిన కోరికలను తీర్చే దేవుడు వినాయకుడు.

ఇది కూడా చదవండి : మహారాష్ట్ర లో ప్రసిద్ధ గణేశ ఆలయాలు !

మన రాష్ట్రం లో సుప్రసిద్ధమైన గణపతి క్షేత్రాలు అనేకం ఉన్నాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలలో చాలామంది ఇంట్లోనే గణపతిని ప్రతిష్ఠించి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. కాస్త సమయం, డబ్బు ఖర్చు చేయాలనుకొనేవారు రాష్ట్రంలో ఉన్న గణపతి క్షేత్రాలకు వెళ్లి ఆయా క్షేత్రాలలో గణపతి దేవుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాచీన గణపతి ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలు కూడా నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటాయి. మరి వాటి విషయానికి వస్తే ..

అయినవిల్లి, తూర్పు గోదావరి జిల్లా

అయినవిల్లి, తూర్పు గోదావరి జిల్లా

అయినవిల్లి, ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కి చెందినది. ఈ ప్రాంతం 'కోనసీమ' గా ఖ్యాతి గడించింది. ఇక్కడ సిద్ది వినాయకుని విగ్రహం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం కాణిపాకం వినాయక క్షేత్రం కన్నా పురతమైనది. ఇక్కడ వినాయక స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు.

చిత్ర కృప : కాసుబాబు

అయినవిల్లి, తూర్పు గోదావరి జిల్లా

అయినవిల్లి, తూర్పు గోదావరి జిల్లా

అయినవిల్లి క్షేత్రం గురించి పురాణాల్లో ప్రస్తావించడం జరిగింది. ఒకనాడు దక్షప్రజాపతి యజ్ఞం చేసేముందు ఇక్కడ ఒక వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించాడు. దానికి తోడు దేవతామూర్తులు రాత్రికి రాత్రే ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణంలో పేర్కొన్నారు.

చిత్ర కృప : www.ainavillivighneswara.com

అయినవిల్లి, తూర్పు గోదావరి జిల్లా

అయినవిల్లి, తూర్పు గోదావరి జిల్లా

అయినవిల్లి క్షేత్రంలో వినాయక చవితి, ఏకాదశి, కార్తీక మాసం మరియు సంక్రాంతి పర్వదినాన పూజలు, ఉత్సవాలు ఆట్టహాసంగా జరుగుతాయి. మహా శివరాత్రి పర్వదినాన ప్రత్యేకమైన ఆర్చనలు నిర్వహిస్తారు.

చిత్ర కృప : wikicommons

అయినవిల్లి, తూర్పు గోదావరి జిల్లా

అయినవిల్లి, తూర్పు గోదావరి జిల్లా

అయినవిల్లి వినాయక స్వామి కి వినాయక చవితి రోజున రకరకాల పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ రోజున దేశంలోని ఏడు జీవ నదుల్లోంచి నీటిని తీసుకొచ్చి సప్తనదీజలాభిషేకం చేస్తారు.

చిత్ర కృప : krishna prasad

అయినవిల్లి, తూర్పు గోదావరి జిల్లా

అయినవిల్లి, తూర్పు గోదావరి జిల్లా

అయినవిల్లి వినాయక స్వామి వారి వింత సంప్రదాయం ఏమిటంటే .. ప్రతియేటా జరిగే వార్షిక పరీక్షల ముందు అంటే ఫిబ్రవరి 2,3 వారాలలో లక్ష పెన్నులతో వినాయక స్వామి వారికి అభిషేకం చేసి, వాటిని విద్యార్థులకు ప్రసాదంగా బహూకరించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ పెన్నులతో పరీక్ష రాస్తే మంచి మార్కులతో పరీక్షలో టాపర్ గా నిలుస్తామన్నది విద్యార్థుల విశ్వాసం.

చిత్ర కృప : www.ainavillivighneswara.com

అయినవిల్లి, తూర్పు గోదావరి జిల్లా

అయినవిల్లి, తూర్పు గోదావరి జిల్లా

అయినవిల్లి చేరుకోవడం ఎలా ??

అయినవిల్లి చేరుకోవడం చాలా సులభం. ఈ క్షేత్రం అమలాపురానికి 12 కి.మీ. దూరంలో ఉన్నది. అదే విధంగా రాజమండ్రి కి 55 కి.మీ. దూరంలో, కాకినాడ కి 72 కి.మీ. దూరంలో ఉన్నది. కోటిపల్లి రైల్వే స్టేషన్, అయినవిల్లి కి సమీప రైల్వే స్టేషన్(6 కి.మీ. దూరంలో) . విమానాల్లో వచ్చే వారైతే రాజమండ్రి ఏర్ పోర్ట్ లో దిగి బస్సులో లేదా క్యాబ్ వంటి వాహనాల్లో ఎక్కి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Hendrik Ploeger

కాణిపాకం, చిత్తూర్ జిల్లా

కాణిపాకం, చిత్తూర్ జిల్లా

కాణిపాకం, చిత్తూర్ జిల్లా కి చెందిన ఒక పుణ్య క్షేత్రం. మన రాష్ట్రంలో స్వయంభూ దేవాలయాలలో మొదటిది. ఈ క్షేత్రంలో కొలువైన దైవం వినాయకుడు. వినాయకుని ఆలయాన్ని క్రీ.శ. 11 వ శతాబ్ధంలో చోళరాజు నిర్మించినాడు.

చిత్ర కృప : రామ ShastriX

కాణిపాకం, చిత్తూర్ జిల్లా

కాణిపాకం, చిత్తూర్ జిల్లా

కాణిపాకం చరిత్ర విషయానికి వస్తే, పూర్వం ముగ్గురు అవిటి అన్నదమ్ముల్లకు పొలం ఉండేదట. ఒకరోజున పొలంలో నీటి కోసం బావి తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతుండగా గడ్డ పార కి నల్లని రాయి తగిలి, అందులోంచి రక్తంకారడం జరిగింది. కొద్ది క్షణాల్లో బావిలోని నీరంతా ఎరుపు రంగులోకి వచ్చేసి, వారి అవిటితనం పోయింది. దీంతో ప్రజలు తండోపతండాలుగా నూతి వద్దకి వచ్చి మరింత లోతు తవ్వడానికి ప్రయత్నించారు. అలా తవ్వుతుండగా వినాయకుని వారి స్వయంభూ విగ్రహం ఊరే నీతి నుంచి పుట్టుకొచ్చింది.

చిత్ర కృప : Lavanya Pictures

కాణిపాకం, చిత్తూర్ జిల్లా

కాణిపాకం, చిత్తూర్ జిల్లా

కాణిపాకం లో ఈ రోజుకీ వినాయక విగ్రహం నూతి లోనే ఉండటం విశేషం. గుడి ప్రాంగణంలోని బావిలో వినాయకుని వాహనం మూషికం(ఎలుక) ఉంటుంది. మనకిష్టమైన ఏదేని వస్తువును వదిలి వెళ్తే, అనుకొన్న కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ వినాయక చవితి పర్వదినాన బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

చిత్ర కృప : Ramesh Ayyapuraju

కాణిపాకం, చిత్తూర్ జిల్లా

కాణిపాకం, చిత్తూర్ జిల్లా

కాణిపాకం చేరుకోవడం ఎలా ??

కాణిపాకం, చిత్తూర్ నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్కడి నుండి ప్రభుత్వ బస్సులు ప్రతి 10 నిమిషాల కొకసారి కాణిపాకానికి బయలుదేరుతాయి. రాష్ట్రం నుండి ఏ మూల నుంచైనా రేణిగుంట / చిత్తూర్ / గూడూరు లకు రైళ్లు నడుస్తుంటాయి. ఇక్కడి నుండి బస్సులో ఎక్కి కాణిపాకానికి చేరుకోవచ్చు. ఒకవేళ విమానాల్లో వచ్చే వారైతే రేణిగుంట విమానాశ్రయం లో దిగి క్యాబ్ లేదా బస్సుల్లో ప్రయాణించి కాణిపాకానికి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Shiva333

చోడవరం, విశాఖ పట్టణం

చోడవరం, విశాఖ పట్టణం

చోడవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పట్టణానికి చెందిన ఒక మండలం. ఇక్కడ వినాయకుని గుడి ప్రసిద్ధమైనది. ఇక్కడి వినాయకుడు కూడా స్వయం భూగా వెలసినాడు.

చిత్ర కృప : wikicommons

చోడవరం, విశాఖ పట్టణం

చోడవరం, విశాఖ పట్టణం

చోడవరం లోని వినాయక ఆలయం క్రీ.శ. 15 వ శతాబ్ధంలో నిర్మించినారు. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం తర్వాత, రెండవ స్వయంభూ క్షేత్రంగా, ఈ క్షేత్రం ప్రాచూర్యం పొందినది. ఇక్కడున్న స్వామి వారిని దర్శించుకుంటే అనుకున్న పనులు నెరవేరతాయని భక్తుల నమ్మకం.

చిత్ర కృప : wikicommons

చోడవరం, విశాఖ పట్టణం

చోడవరం, విశాఖ పట్టణం

చోడవరం ఎలా చేరుకోవాలి ??

చోడవరం విశాఖ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖ నుండి ప్రతి రోజు గంట గంట కి బస్సులు చోడవరానికి తిరుగుతుంటాయి. రైళ్లలో వచ్చే ప్రయాణీకులు 18 కిలోమీటర్ల దూరంలోని అనకాపల్లి రైల్వే స్టేషన్ లో గాని, 19 కిలోమీటర్ల దూరంలోని కాసింపేట రైల్వే స్టేషన్ లో గాని మరియు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ రైల్వే స్టేషన్ లో గాని దిగి బస్సుల్లో గాని లేదా ప్రవేట్ వాహనాల్లో గాని ప్రయాణించవచ్చు. విమానాల్లో వచ్చే ప్రయాణీకులు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైజాగ్ విమానాశ్రయం నుండి చోడవరానికి చేరుకోవచ్చు.

చిత్ర కృప : leelasaladi

బిక్కవోలు, తూర్పు గోదావరి

బిక్కవోలు, తూర్పు గోదావరి

బిక్కవోలు తూర్పు గోదావరికి చెందిన ఒక ప్రముఖ పుణ్య క్షేత్రం. ఇక్కడ తూర్పు చాళుక్యుల కాలంలో ఎన్నో ఆలయాలు నిర్మించబడ్డాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసిన ఆలయం లక్ష్మి గణపతి ఆలయం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 9 వ శతాబ్ధంలో నిర్మించినారు.

చిత్ర కృప : ramareddy vogireddy

బిక్కవోలు, తూర్పు గోదావరి

బిక్కవోలు, తూర్పు గోదావరి

బిక్కవోలు లోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయం లో ప్రధానంగా చెప్పుకోవాల్సినది 11 అడుగుల గణేషుని విగ్రహం.ఇది తూర్పు చాళుక్యుల కాలంలో ప్రతిష్టించిన విగ్రహాలన్నిటిలోకి పెద్దది.

చిత్ర కృప : Madhav Kopalle

బిక్కవోలు, తూర్పు గోదావరి

బిక్కవోలు, తూర్పు గోదావరి

బిక్కవోలు చేరుకోవడం ఎలా ??

బిక్కవోలు కి సమీపాన 55 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం, 155 కిలోమీటర్ల దూరంలో విజయవాడ విమానాశ్రయాలు ఉన్నాయి. బిక్కవోలులో రైల్వే స్టేషన్ ఉంది కనుక రైళ్లలో వచ్చే యాత్రికులు సులభంగా చేరుకోవచ్చు. అంతేకాక, రాజమండ్రి నుండి బిక్కవోలుకు బస్సులు నిత్యం తిరుగుతుంటాయి.

చిత్ర కృప : ramareddy vogireddy

సాక్షి గణపతి ఆలయం ,శ్రీశైలం

సాక్షి గణపతి ఆలయం ,శ్రీశైలం

శ్రీశైలం కర్నూలు జిల్లాలో తో పాటు, దేశంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడి ప్రధాన దైవం మల్లికార్జున స్వామి. శ్రీశైల ప్రధానాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంది. భక్తులు శ్రీశైల మహా క్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెబుతాడు కనుక, ఈ స్వామి సాక్షి గణపతి గా ప్రసిద్ధుడు.

చిత్ర కృప : wikicommons

సాక్షి గణపతి ఆలయం ,శ్రీశైలం

సాక్షి గణపతి ఆలయం ,శ్రీశైలం

చక్కని నల్లరాతితో మలచబడి, కుడివైపునకు తిప్పిన తొండంతో చేతిలో భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లున్న ఈ సాక్షి గణపతి ఉన్నదని శ్రీనాథుని కాశీఖండంలో ప్రస్తావించబడింది. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించ వచ్చే యాత్రికులు తప్పక ఈ స్వామిని సందర్శిస్తారు.

చిత్ర కృప : Manfred Sommer

సాక్షి గణపతి ఆలయం ,శ్రీశైలం

సాక్షి గణపతి ఆలయం ,శ్రీశైలం

శ్రీశైలం చేరుకోవడం ఎలా ??

శ్రీశైలానికి 155 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, 200 కిలోమీటర్ల దూరంలో విజయవాడ దేశీయ విమానాశ్రయం ఉన్నాయి. కంభం(60 కిలోమీటర్ల దూరంలో), తర్లుపాడు(59 కిలోమీటర్ల దూరంలో) శ్రీశైలానికి సమీప రైల్వే స్టేషన్ లు గా ఉన్నాయి. రోడ్డు మార్గం ద్వారా వచ్చేవారు కర్నూలు నగరం నుండి కానీ, హైదరాబాద్ నగరం నుండి కానీ ప్రభుత్వ బస్సుల్లో శ్రీశైలానికి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Amit Chattopadhyay

పాతాళ వినాయకాలయం, కాళహస్తి

పాతాళ వినాయకాలయం, కాళహస్తి

శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లాకి చెందిన పుణ్య క్షేత్రం. దక్షిణ భారత దేశంలోకెల్లా ప్రాచీనమైన క్షేత్రం గా విరాజిళ్లుతుంది. శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయ ఉత్తర గోపురానికి సమీపంలో ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు పాతాళంలో కొలువుదీరి ఉంటాడు.

చిత్ర కృప : Kiran M

పాతాళ వినాయకాలయం, కాళహస్తి

పాతాళ వినాయకాలయం, కాళహస్తి

శ్రీ కాళహస్తీశ్వరస్వామివారిని సందర్శించుకున్న భక్తులంతా ఈ స్వామిని సేవించుకోవడం పరిపాటి. పాతాళ వినాయకుడి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. చిత్తూరు జిల్లా తిరుపతికి 38 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.

చిత్ర కృప : Anulal

పాతాళ వినాయకాలయం, కాళహస్తి

పాతాళ వినాయకాలయం, కాళహస్తి

శ్రీకాళహస్తి ఎలా చేరుకోవాలి ??

శ్రీకాళహస్తి కి తిరుపతి నుండి ప్రతి 5 నిమిషాలకి ఒక ప్రభుత్వ బస్సు నడుస్తుంది. రైళ్లలో వచ్చే యాత్రికులు శ్రీకాళహస్తి లోని రైల్వే స్టేషన్ లో దిగి ఆలయానికి చేరుకోవచ్చు. ఒకవేళ విమాన మార్గాల్లో వచ్చే వారైతే రేణిగుంట విమానాశ్రయంలో దిగి, క్యాబ్ లేదా తిరుపతి వద్ద కి వచ్చి ప్రభుత్వ బస్సులో ఎక్కి శ్రీకాళహస్తి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Arun Tuticorin

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+