Search
  • Follow NativePlanet
Share
» »భాగ్య‌నగ‌రంలో టూరిజం స్పాట్‌లుగా పేరుగాంచిన ప్రాచీన సమాధులు...

భాగ్య‌నగ‌రంలో టూరిజం స్పాట్‌లుగా పేరుగాంచిన ప్రాచీన సమాధులు...

హైద‌రాబాద్‌లో ప‌ర్యాట‌కులు సంద‌ర్శించాల్సిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ప్ర‌కృతి అందాల‌తో కూడిన ప్రాంతాల‌తోపాటు అద్భుత శిల్ప‌క‌ళ‌తో క‌ట్టిన నిర్మాణాలు కూడా మ‌రెన్నో దాగి ఉన్నాయి. ఇక్క‌డ అంద‌మైన జల‌పాతాలు, స‌ర‌స్సులు, న‌దులు, ఆధ్యాత్మికప్ర‌దేశాల‌తో పాటు ప్రాచీన స‌మాధులు కూడా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ స‌మాధులు టూరిస్ట్ స్పాట్‌లుగా ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. వీటిని చూసేందుకు సంద‌ర్శ‌కులు కూడా త‌ర‌లి వ‌స్తున్నారు. భాగ్య‌న‌గ‌రంలో ప్ర‌సిద్ధ‌చెందిన ప్రాచీన స‌మాధుల గురించి తెలుసుకుందామా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా పలు ప్రాచీన సమాధులు టూరిజం స్పాట్స్ గా అభివృద్ధిచెందుతున్నాయి. ఈ స‌మాధులు అతి పురాత‌న‌మైన‌వి మ‌రియు ప్రాచీన‌మైన‌వి కూడా. ఈ నిర్మాణాలు అద్భుత శిల్పకలతో నగర చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అంతేకాదు, భాగ్య‌న‌గ‌ర అందాల‌కు కొత్త శోభ‌ను అందించేవిధంగా ఈ స‌మాధులు దాగి ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ స‌మాధులు న‌గ‌రంలోని ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

qutubshahitombs

ఎన్‌టీఆర్ ఘాట్

హైదరాబాద్‌లో ప్ర‌సిద్ధిచెందిన స‌మాధుల‌లో ఎన్‌టీఆర్ ఘాట్ ఒక‌టి. ఇది తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నిలిచిపోయే పేరు నందమూరి తారక రామారావు స‌మాధి. సినీ నటుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంత‌గానో ఆక‌ట్టుక‌న్నారు. ఆయ‌న న‌టుడిగానే కాకుండా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఆయన సమాధి హుస్సెన్ సాగర్ తీరంలో వుంది. దాని పేరే ఎన్‌టీఆర్ ఘాట్‌. ప్ర‌స్తుతం ఈ స‌మాధి న‌గ‌రంలోని ప‌ర్యాట‌కుల‌కు టూరిస్టు స్పాట్‌గా మారింది. చుట్టు ప‌చ్చ‌ని గార్డెన్‌తో ఇక్క‌డికొచ్చే వారిని ఆక‌ట్టుకుంటోంది. ఈ ప్ర‌దేశం ఎప్పుడూ ప‌ర్యాట‌కులుతో నిండి ఉంటుంది. సాయంత్రం స‌మ‌యాల్లో ఇక్క‌డికి సంద‌ర్శ‌కులు ఎక్కువ‌గా వ‌స్తుంటారు. ఎన్‌టీఆర్ జ‌యంతి, వ‌ర్ధంతి స‌మ‌యంలో నంద‌మూరి ఫ్యామీలీ, టీడిపి నాయ‌కుడు ఈ స‌మాధి వ‌ద్ద‌కు వ‌స్తుంటారు.

golcondafort

కుతుబ్ షాహీ సమాధులు

న‌గ‌రంలో ప్ర‌సిద్ధిచెందిన స‌మాదుల్లో కుత్‌బ్ షాహీ సమాధులు ముఖ్య‌మైన‌వి. ఇవి హైదరబాద్ నగరాన్ని నిర్మించిన కుతుబ్ షాహీ వంశీయులు సమాధులు. ప్ర‌స్తుతం ఈ స‌మాధులు ప‌ర్యాట‌కుల సందర్శనీయ ప్రదేశాలుగా మారాయి. ఈ స‌మాధుల‌ను ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించారు. ఇక్క‌డికొచ్చే వారిని ఈ సమాధులు త‌మ అద్భుత‌మైన శిల్ప‌క‌ల‌తో ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ పురాత‌న‌, చారిత్ర‌క స‌మాధులు 16వ శతాబ్దానికి చెందినవి.ఈ సమాధులు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తింపుపొందాయి.

ఇక‌, ఈ స‌మాధుల‌న్నీ ఒకే చోట ఉండ‌డం విశేషం..కుతుబ్ షాహీలు ఈ సమాధులను ఎంతో పవిత్రమైనవిగా భావించేవారట. అందుకే ఈ స‌మాధుల‌ను అత్యంత అందంగా తీర్చిదిద్దారు. ఇక‌, ఈ సమాధులు న‌గ‌రంలోని గోల్కొండ కోటకు ఉత్తరాన కిలోమీటర్ దూరంలో ఇబ్రహీ బాగ్ లో ఉంటాయి. ఈ స‌మాధుల‌పై ఒకప్పుడుఖరీదైన కార్పెట్లు,వెల్వెట్ తెరలు, షాండ్లియర్లు, వెండి అలంకరణ సామాగ్రిలు వుండేవ‌ట‌. వీటితోపాటు అందమైన పూదోటలు కూడా వుండేవట‌. కానీ, ఇవ‌న్నీ కాలక్రమేనా కనుమరుగపోయిన‌ట్లు ఇక్క‌డివారు చెబుతున్నారు. పురాత‌న‌, చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సమాధులను వీక్షించేందుకు ఒక్క న‌గ‌ర‌వాసులే కాదు, రెండు తెలుగురాష్ట్రాల ప్ర‌జ‌ల‌తోపాటు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వ‌స్తుంటారు.

hussainsagarbeach

పైగా సమాధులు

ఈ స‌మాధుల‌తోపాటు హైదరాబాద్‌లో పైగా సమాధులు కూడా టూరిస్టు స్పాట్‌లుగా నిలిచాయి. అయితే, వీరు రాజులు కాదు. నిజాం రాజుల వద్ద కీలక బాధ్యతల్లో ప‌నిచేసిన‌వారు. ఈ పైగా వంశీయుల సమాధులు ప‌ట్ట‌ణంలోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్నాయి. పిసల్ బండ ప్రాంతంలో ఓవైసిహాస్పిటల్ కు సమీపంలో ఈ సమాధులను నిర్మించారు. ఇవి సుమారు 200 సంవత్సరాల నాటి స‌మాధులు. ప్ర‌స్తుతం ఈ స‌మాధులు బాగా దెబ్బ‌తిన్నాయి. పురాత‌న‌, ప్రాచీన క‌ళ‌ల‌ను పైగా స‌మాధుల‌పై చూడొచ్చు..

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+