Search
  • Follow NativePlanet
Share
» »ఏప్రిల్ 6 నుంచి 18వ‌ర‌కు ల‌డ‌ఖ్‌లో ఆప్రికాట్ బ్లూసమ్ ఫెస్టివల్..

ఏప్రిల్ 6 నుంచి 18వ‌ర‌కు ల‌డ‌ఖ్‌లో ఆప్రికాట్ బ్లూసమ్ ఫెస్టివల్..

లడఖ్ ప్రతి సీజన్లో పర్యాటకులను ఎంత‌గానో ఆకర్షిస్తుంది. కానీ ఏప్రిల్ మాసంలో లడఖ్ అందం మ‌రింత రెట్టింప‌వుతుంది. చరిత్ర ప్రేమికుల నుండి సాహస ప్రియుల వరకు, లడఖ్ ఏడాది పొడవునా పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంది, అయితే ఏప్రిల్‌లో లడఖ్‌కు వచ్చే పర్యాటకులు ప్రకృతి ప్రేమికుల సంఖ్య అమాంతం పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ఇక్క‌డ ప్ర‌తి సంవ‌త్స‌రం ఆప్రికాట్ బ్లూసమ్ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది. ఇక‌, ఈ ఏడాది కూడా ఏప్రిల్‌లో లడఖ్‌లో ఆప్రికాట్ బ్లూసమ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ పండుగను లడఖ్ పర్యాటక శాఖ ప్ర‌తి ఏటా నిర్వహిస్తోంది.

apricotblossomfestival

ఆప్రికాట్ బ్లూసమ్ ఫెస్టివల్ అంటే ఏంటీ..?

ఆప్రికాట్ బ్లూసమ్ ఫెస్టివల్ అంటే నేరేడు పండు వికసించే పండుగ అని అర్థం. ఏప్రిల్ నెలలో, నేరేడు చెట్లపై చిన్న గులాబీ పువ్వులు వికసిస్తాయి. ఇవి లడఖ్‌ లోయను తమ అందంతో గులాబీ రంగులో మారుస్తాయి. ఏప్రిల్ మాసంలో ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కులు ప్ర‌త్యేకంగా ఈ పువ్వుల‌కు ఆక‌ర్షితుల‌వుతుంటారు. మ‌రికొంద‌రైతే ఈ ఫెస్టివ‌ల్ కోస‌మే లడఖ్‌ను సందర్శిస్తుంటారు. ఇక‌, ఈ ఏడాది ఏప్రిల్ 6 నుండి 18 వరకు లేహ్, లడఖ్‌లలో ఈ పండుగను నిర్వహించనున్నారు. ఈ సమయంలో, లడఖ్ లోయలోని ప్రతి నేరేడు చెట్టు చిన్న తెలుపు మరియు గులాబీ పువ్వులతో నిండి ఉంటుంది. ఇవి ప‌ర్యాట‌కులు ఆకర్షణీయమైన దృశ్యాన్ని అందిస్తాయి. ఈ ఫెస్టివ‌ల్ విశేషాలేంటో తెలుసుకుందాం ప‌దండి.

ఇది ఒక సాంస్కృతిక పండుగ‌..

లడఖ్‌లోని అప్రికాట్ బ్లోసమ్ ఫెస్టివల్, ఒక సాంస్కృతిక పండుగ, ఇది పర్యాటకులను ప్రకృతితో మాత్రమే కాకుండా లడఖ్ సంస్కృతితో కూడా కలుపుతుంది. ఈ సమయంలో ఇక్క‌డ అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ జానపద నృత్యం-సంగీతం మొదలైనవి నిర్వహిస్తారు. ఇది లడఖ్ యొక్క గొప్ప సంస్కృతి మరియు దాని సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఏప్రిల్ మాసంలో ఇక్క‌డ ప్ర‌త్యేకించి రాఫ్టింగ్, క్యాంపింగ్ మొదలైన వాటిని కూడా ఆస్వాదించొచ్చు. పగటిపూట ప‌ర్యాట‌కులు చెట్లపై నేరేడు పండ్ల రుచిని కూడా ట్రై చేయొచ్చు. రాత్రిపూట ఇక్క‌డ క్యాంపింగ్ కూడా చేయవచ్చు. అంతేకాకుండా, ట్రెక్కింగ్ ద్వారా ఇక్క‌డికి స‌మీపంలోని వివిధ టిబెటన్ మఠాలకు కూడా చేరుకోవచ్చు. ఈ ప్ర‌దేశాలు అడ్వంచ‌ర్ ట్రిప్ కోరుకునేవాళ్ల‌కు ఎంతో బాగుంటాయి.

apricotblossomfestival ladakh

ఇక్క‌డి డ్రై ఫ్రూట్స్ ఎంతో ఫేమ‌స్‌...

ఈ ప్ర‌దేశం ఫోటోగ్రఫీకి స్వర్గధామం అని చెప్పుకోవ‌చ్చు. అయితే అప్రికాట్ బ్లూసమ్ ఫెస్టివల్ సందర్భంగా లడఖ్‌కు వెళ్లేటప్పుడు, మీతో పాటు పెద్ద లెన్స్ ఉన్న కెమెరాను తీసుకెళ్లడం అస్స‌లు మర్చిపోవద్దు. ఎందుకంటే, ప్ర‌కృతి అందాల‌ను మీమీ కెమెరాల్లో బంధించొచ్చు. ఈ లేత గులాబీ మరియు తెలుపు పువ్వుల‌ను క‌చ్చితంగా కెమెరాల్లో బందించాల్సిందే. లేహ్ మరియు కార్గిల్‌లో ఆప్రికాట్ బ్లోసమ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇది లేహ్‌లోని దోమ్‌కర్ ధో మరియు కార్గిల్‌లోని గార్ఖోన్ మరియు సంజాక్‌లలో చూడొచ్చు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, అప్రికాట్ బ్లోసమ్ ఫెస్టివల్‌కు హాజ‌ర‌యిన‌వారు త‌ప్ప‌కుండా ఇక్క‌డి డ్రై ఫ్రూట్స్ కొనడం మర్చిపోవద్దు. ఇక్క‌డ డ్రై ప్రూట్స్ అత్యంత నాణ్య‌త గ‌ల‌వి అతి త‌క్కువ ధ‌ర‌ల‌లోనే ల‌భిస్తాయి.

More News

    Read more about: ladakh tour ladakh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+