Search
  • Follow NativePlanet
Share

లడఖ్ - హిమాలయ రాజ్యం !

31

సింధు నదీ తీరాన ఉన్న లడఖ్, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దీనికి “ఆఖరి శాంగ్రి లా” ( ది లాస్ట్ శాంగ్రి లా) , “ చిట్టి టిబెట్” ( లిటిల్ టిబెట్), “ చంద్ర ప్రదేశం” ( ది మూన్ ల్యాండ్), “ విరిగిన చంద్రుడు” ( ది బ్రోకెన్ మూన్) అనే పేర్లు కూడా ఉన్నాయి. ప్రధాన నగరం లెహ్ కాకుండా, ఇక్కడికి సమీపంలో అల్చి, నుబ్రా లోయ, హేమిస్, లమయురు, జంస్కర్ లోయ, కార్గిల్, పంగోంగ్ త్సో, త్శో కర్, త్సో మొరిరి లాంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, మంత్రం ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు, పర్వత శిఖరాలు, ఈ ప్రదేశం యొక్క కొన్ని ఆకర్షణీయమైన అంశాలు. ఈ రాష్ట్రం లోని సాధారణంగా మాట్లాడే భాషలు లడఖి, పురిగ్, టిబెటన్, హిందీ మరియు ఇంగ్లీష్ .

ప్రపంచం లోనే రెండు ప్రముఖ పర్వత శ్రేణులైన కారకోరం మరియు హిమాలయాల నడుమ,సముద్ర మట్టానికి సుమారు 3500 మీటర్ల ఎత్తులో లడఖ్ కొలువుదీరింది. అదనంగా, సమాంతర శ్రేణులైన జంస్కర్, లడఖ్ పర్వత శ్రేణులు కూడా లడఖ్ లోయని చుట్టుముడుతున్నాయి. లడఖ్, నిజానికి, ఒక పెద్ద సరస్సులో మునిగిన ప్రదేశమని, ఏళ్ల పాటు జరిగిన వివిధ భౌగోళిక మార్పుల వల్ల ఇది లడఖ్ లోయ గా మారిందని నమ్ముతారు.

ఈనాడు జమ్మూ & కాశ్మీర్ లోని భాగమైన లడఖ్, 10 వ శతాబ్దంలో టిబెట్ రాజుల వారసులచే పాలించబడింది. ఈ హిమాలయ రాజ్య పాలన, సేంగ్గే నంగ్యాల్ రాజు కాలంలో 17వ శతాబ్దంలో పతాక స్థాయికి చేరుకుంది.

బౌద్ధం ఇక్కడి ప్రబలమైన మతం కావటం వల్ల, లడఖ్ ఆకర్షణల జాబితాలో బౌద్దారామాలు లేదా గొంపలు ప్రధానంగా చోటు చేసుకుంటాయి. హేమిస్ ఆరామం, శంకర్ గొంప, మాతో ఆరామం,షే గొంప, స్పితుక్ ఆరామం, స్టంకా ఆరామం ఈ ప్రదేశంలోని కొన్ని ముఖ్యమైన ఆరామాలు. ఇవి కాకుండా, తిక్సీ ఆరామం, త్సేమో ఆరామం కూడా దర్శనీయమైనవే.

గల్దన్ నమ్చోట్, బుద్ధ పూర్ణిమ, దోస్మోచే మరియు లోసార్, లడఖ్ లోని ఘనంగా జరుపుకునే పండుగలు. ఈ సమయంలో యాత్రికులు ఇబ్బడి ముబ్బడిగా ఇక్కడికి చేరుకుంటారు. రెండు రోజుల పాటు జరిగే దోస్మోచే ఉత్సవం లో సన్యాసులు నృత్యం చేసి, పూజలు అందించి, క్రతువులు నిర్వహించి దురదృష్టాన్ని, దురాత్మలని ఈ ప్రదేశం నుంచి దూరంగా తరిమి కొడతారు. టిబెట్ బౌద్ధుల అత్యంత ముఖ్యమైన పండగలలో ఒకటైన శక దావా లో గౌతమ బుద్దుని జననం, అతని బౌద్ధత్వం, అతని భౌతిక శరీర మృతిని జరుపుకుంటారు. ఇది టిబెట్ క్యాలెండర్ నాల్గవ నెలలో , సాధారణంగా మే లేక జూన్ లలో, ఒక నెల రోజుల పాటు ఉంటుంది.

యాత్రికులు టాక్సీలను గానీ ,అద్దె బైక్ లనుగానీ ఉపయోగించి ఈ ప్రదేశంలో తిరగవచ్చు. ఇక్కడికి వచ్చే ప్రజలు, సౌకర్యంగా ఉంటుందని, సాధారణంగా స్వంత వాహనాల్లో వస్తారు. ఈ ప్రాంత ఉపరితలం ఎగుడు దిగుడులతో గరుకుగా ఉండటం వల్ల, యాత్రికులు వాహన విడి భాగాలను తీసుకుని వెళ్తే అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడతాయి. తుప్కాలు, సూప్ నూడుల్స్, మోమోలు, డంప్లింగులు వడ్డించే ఎన్నో భోజనశాలలు ఈ ప్రదేశంలో ఉన్నాయి.

పర్యాటకులు, మే మరియు సెప్టెంబర్ మధ్య ఎప్పుడైనా, లడఖ్ పర్యటనకు ప్రణాళిక తయారు చేయవచ్చు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు మించవు.

లడఖ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

లడఖ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం లడఖ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? లడఖ్

  • రోడ్డు ప్రయాణం
    రహదారి: జమ్మూ మరియు శ్రీనగర్ నుంచి లడఖ్ రహదారి మార్గం గుండా చేరుకోవచ్చు. ఈ మూడు నగరాలను కలుపుతూ రెండు ప్రధాన రహదారులు ఉన్నాయి. జూలై మరియు సెప్టెంబర్ ల మధ్య తెరవబడే రోహతంగ్ కనుమ గుండా వెళ్ళే మనాలి-లడఖ్ రహదారి ఒకటి. జూన్ మరియు అక్టోబర్ ల మధ్య తెరవబడే జోజి లా కనుమ గుండా వెళ్ళే శ్రీనగర్-లడఖ్ రహదార రెండోది. జమ్మూ & కాశ్మీర్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (జె.కె.ఆర్.టి.సి) మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( హెచ్.ఆర్.టి.సి) లడఖ్ కు బస్సు సౌకర్యం కల్పిస్తున్నాయి. ప్రయాణికులు టాక్సీలు లేదా జీపుల మీద కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం: లేహ్ కి అతి సమీపం లోని రైల్వే స్టేషన్, లడఖ్ కి 712 కి. మీ ల దూరం లో ఉన్న జమ్ము తావి రైల్వే స్టేషన్. జమ్మూ తావి రైల్వే స్టేషన్, దేశం లోని ప్రధాన నగరాలైన కొత్త ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై లాంటి నగరాలకు అనుసంధానించబడింది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    లడఖ్ కు వెళ్లాలనుకునే యాత్రికులు, ప్రధాన రవాణా పద్ధతులలో ఎదో ఒకటి, విమాన యానం, రైలు ప్రయాణం లేక రహదారులని గానీ ఎన్నుకోవచ్చు. విమాన యానం: రాష్ట్రం లోని ప్రధాన నగరాలకు అనుసంధానించబడిన లడఖ్ విమానాశ్రయం ఇక్కడికి అతి సమీపం లోని విమానాశ్రయం. అయితే, జమ్మూ విమానాశ్రయం, జమ్మూ&కాశ్మీర్ లోని ప్రధాన విమానాశ్రయం. జమ్మూ నుంచి దేశం లోని ప్రధాన నగరాలైన కొత్త ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై లాంటి నగరాలకి ఎన్నో విమానాలు ఉన్నాయి. కొత్త ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లడఖ్ ని అంతర్జాతీయంగా కూడా కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue