మరో రెండురోజుల్లో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా చాలామంది అమ్మవారి ఆలయాలను సందర్శించేందుకు పయనమవుతుంటారు. దేశంలోనే ప్రసిద్ధిచెందిన అమ్మవారి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే, దసరా ఉత్సవాలకు దేశంలో అత్యంత ప్రసిద్ధిచెందిన రాష్ట్రం కర్ణాటక.. ఇక్కడ మైసూర్ దసరా ఉత్సవాలను ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. దసరా ఉత్సవాలకు ప్రత్యేకంగా చాలామంది కర్ణాటకను సందర్శిస్తుంటారు. ఇక్కడ ఈ ఉత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలను కూడా జరుపుతారు.
రాష్ట్రంలోని మైసూర్ నగరాన్ని ప్యాలెస్ నగరం అని అంటారు. ఇక్కడ ఉండే పురాతన కట్టడాలు.. ఇతర టూరిస్టు ప్రదేశాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. దేశంలోనే అత్యంత పెద్ద ప్యాలెస్‌లలో ఒకటి మైసూర్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ 1912 వడయార్ రాజవంశానికి చెందినది. దీనిని 24వ పాలకులతో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్యాలెస్‌లో ప్రదర్శించే లైట్ అండ్ మ్యూజిక్ షో భారత్‌లోనే అత్యంత పేరుగాంచింది.
ఇంతటి ప్రసిద్ధిచెందిన ప్రదేశాలపాటు ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఇక్కడి అనేక సుందరమైన ప్రదేశాలను కూడా వీక్షించొచ్చు. దసరా వేళ ఇక్కడ పండుగ వాతావరణం అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంబారీ బస్సులు, గజరాజులు, అద్భుతమైన కళాఖండాలు మరెన్నింటినో ఇక్కడ ప్రదర్శిస్తారు. దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

చాముండేశ్వరి దేవాలయం
మైసూరు దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ నవరాత్రుల్లో తొమ్మిదిరోజుల పాటు కొండపై అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వెళ్తారు. చాముండి దేవాలయానికి వెళ్లే దారి కూడా ఎంతో ఆహ్లదభరితంగా ఉంటుంది. కనుచూపుమేరంతా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. ఘాట్ రోడ్డులో ప్రయాణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మైసూరు ప్యాలెస్..
కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచింది. అయితే దసరా నవరాత్రుల ఉత్సవాల సమయంలో ఈ ప్యాలెస్‌ను మరింత అందంగా ముస్తాబు చేస్తారు. ఈ ప్యాలెస్ విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతుంటుంది. వేలాది బల్బులతో ఈ ప్యాలెస్‌ను అలంకరింస్తారు. రాత్రి వేళల్లో ఈ దీపాల అలంకరణతో ఉన్న ప్యాలెస్ ను చూసేందుకే చాలామంది వస్తుంటారు. ఈ ప్యాలెస్ లోపలికి ప్రవేశించేందుకు ఒక్కరికి టికెట్ ధర రూ.100 ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ లోపల అప్పటి కాలంలో రాజులు, రాణులు, సైనికులు వాడిన కత్తులు, కటారులు, కుర్చీలు, వాహనాలు ఇతర వస్తువులు ఉంటాయి. మైసూర్ ప్యాలెస్ లైటింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి లక్షల సంఖ్యలో టూరిస్టులు తరలివస్తుంటారు.

జంబూ రైడ్
మైసూర్ దసరా నవరాత్రుల ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది జంబూ రైడ్. ఇది నవరాత్రుల పదో రోజున ఉంటుంది. ఈ జంబూ రైడ్‌లో ప్రధాన ఏనుగు 750 కిలోల బరువున్న శ్రీచాముండేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించిన బంగారు అంబరీని తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఇందులో భాగంగా వందలాది ఏనుగులు బంగారు పూతతో కూడిన దుస్తులు ధరించి మైసూర్ వీధుల్లో ఊరేగుతుంటాయి. ఇది చూసేందుకు కనుల పండువగా ఉంటుంది.



Click it and Unblock the Notifications













